Share News

Poor Blood Circulation: రక్త ప్రసరణలో లోపాలా? ఇలా చేస్తే మంచి ఫలితాలు!

ABN , Publish Date - Oct 13 , 2024 | 11:32 AM

రక్తనాణాల్లో పేరుకునే కొవ్వు, రక్తం గడ్డకట్టడం తదితర కారణాలతో రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. సమస్య తొలి దశల్లో ఉన్నప్పుడు రోగ లక్షణాలు కాళ్లు, వేళ్లు వంటి భాగాల్లో కనిపిస్తాయిన నిపుణులు చెబుతున్నారు. వీటిని గుర్తించగానే వైద్యులను సంప్రదించాలి.

Poor Blood Circulation: రక్త ప్రసరణలో లోపాలా? ఇలా చేస్తే మంచి ఫలితాలు!

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి శరరీంలో ఏదో తెలీని నొప్పి అనిపిస్తుంది. కొన్ని సార్లు కళ్లు, వేళ్లల్లో చక్కలిగింతలతో కూడిన వింత ఇబ్బంది తలెత్తుతుంది. ఎప్పుడన్నా ఇలా జరిగితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తరచూ జరిగితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ నెమ్మదించినప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు (Health).

Coconut Oil: రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!


రక్తప్రసరణకు ఆటంకాలు ఇలా..

శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లడమే రక్తం విధి. అంతేకాదు..ఆయా భాగాల్లోని మలినాలను కూడా తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇది సాఫీగా సాగాలంటే రక్తసరఫరాకు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ఏదైనా కారణంతో రక్తసరఫరాకు కలిగే అడ్డంకులు సమస్యలను సృష్టిస్తాయి. అయితే, కీలక అవయవాలను ఇబ్బందులు రాకుండా శరీరం వెంటనే జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి గుండెకు దూరంగా ఉండే వేళ్లు, కాళ్లు వంటి భాగాల్లో ఈ ఆటంకాల తాలూకు ప్రభావం ముందుగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Cakes: కేక్ అంటే ఇష్టపడే వారికి నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే!


రక్తప్రసరణ లోపాల లక్షణాలు

రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడినప్పుడు కాళ్ల నొప్పులు వేధిస్తాయి. నడుస్తున్నప్పుడు నొప్పి మొదలై ఇబ్బంది పెడుతుంది. చర్మం కింద సూదులతో గుచ్చుతున్న భావన కలుగుతుంది. చర్మం రంగు మారుతుంది. కొన్ని చోట్ల నరాలు వాచినట్టు కూడా కనిపిస్తాయి.

రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడటానికి జన్యుపరమైన కారణాలతో పాటు వయసు, డయాబెటీస్, బీపీ వంటివి కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం, రక్తం గడ్డకట్టడం వంటి కారణాలతో రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. ధూమపానం, హైబీపీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకోడం, వెరికోస్ వెయిన్స్, ఊబకాయం ఉన్న వాళ్లకు ఈ రిస్క్ ఎక్కువ.

అయితే, క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం, పౌష్టికాహారం తినడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేస్తే సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.

Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!

Read Health and Latest News

Updated Date - Oct 13 , 2024 | 11:32 AM