Share News

Chewing Gum: అలర్ట్.. రోజూ బబుల్ గమ్ నమిలితే జరిగేది ఇదే!

ABN , Publish Date - Sep 29 , 2024 | 10:36 PM

బబుల్ గమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు బోర్ కొట్టిందని, మరికొందరు మౌత్ ఫ్రెషన్నర్‌గా వాడుతుంటారు. అయితే, రోజూ బబుల్ గమ్ నమిలే వారు పలు విషయాలపై దృష్టిపెట్టాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Chewing Gum: అలర్ట్..  రోజూ బబుల్ గమ్ నమిలితే జరిగేది ఇదే!

ఇంటర్నెట్ డెస్క్: బబుల్ గమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు బోర్ కొట్టిందని, మరికొందరు మౌత్ ఫ్రెషన్నర్‌గా వాడుతుంటారు. అయితే, రోజూ బబుల్ గమ్ నమిలే వారు పలు విషయాలపై దృష్టిపెట్టాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు (Health).

మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ! ఎందుకంటే..


బబుల్ గమ్‌తో కలిగే ఉపయోగాలు..

చక్కెర లేని బుబుల్ గమ్‌లు, ముఖ్యంగా జైలిటాల్ ఉన్న వాటితో నోటి ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. లాలాజలం నోటికి సహజసిద్ధమైన రక్షణగా పనిచేస్తోంది. బబుల్‌గమ్‌ నమిలితే లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా హానికర ఆమ్లాలు న్యూట్రలైజ్ అవుతాయి. పళ్ల మధ్య ఉండే ఆహార అవశేషాలు కడుపులోకి వెళ్లిపోతాయి. పళ్లపై ఉండే ఎనామిల్ రక్షణ పొర పునరుద్ధరణకు నోచుకుంటుంది. అయితే, ఈ ఉపయోగాలు కావాలంటే షుగర్ ఫ్రీ బబుల్ గమ్స్ మాత్రమే నమలాలని నిపుణులు చెబుతున్నారు (Effects of Chewing Gum Daily).

బబుల్ గమ్ నమిలితే మెదడుకు రక్తసరఫరా పెరుగుతుంది. దీంతో, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వంటివి పెరుగుతాయి. ఇక విమానాల్లో తరచూ ప్రయాణించే వారికీ బబుల్ గమ్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయట. విమానం టేకాఫ్ లాండింగ్ సమయాల్లో బబుల్ గమ్ నమిలితే చెవిలోని యూస్టేషియన్ ట్యూబుల్లో పీడనం స్థిరీకరణకు గురై చెవి ఇబ్బంది తగ్గుతుంది.

ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?


అతిగా బబుల్ గమ్ నమలడంతో నష్టాలు

అతిగా బబుల్ గమ్ నమిలితే, అదీ ఒకే దవడన వైపు గమ్ పెట్టుకుంటే చివరకు దవడ నొప్పి వస్తుందని చెబుతున్నారు. ఇది ముదిరితే తలనొప్పి, చెవి నొప్పి, ఆహారం తినడంలో ఇబ్బందులు కూడా కలుగుతాయని అంటున్నారు.

ఇక చక్కెరలు ఉన్న బబుల్ గమ్స్ నమిలితే పళ్లకు హాని కలుగుతుంది. పళ్లపై ఉండే ఎనామిల్ పొర కోతకు గురై కావిటీలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో పళ్ల సమస్యలు తీవ్రమవుతాయి.

తరచూ బబుల్ గమ్ నమిలే వారి కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్లి ఉబ్బరం, గ్యాస్, కడుపు ఇబ్బంది వంటివి తలెత్తుతాయి. బబుల్ గమ్‌‌లోని సార్బిటాల్ లాంటి కృత్రిమ చక్కెరలతో కడుపు అప్‌సెట్ అవుతుంది. దీనితో ఆకలి కూడా మందగించి ఆహారపు అలవాట్లతో మార్పులు వస్తాయి. ఇది ఇతర అనారోగ్యాలకు దారి తీస్తుంది.

వైద్యుల సూచనల ప్రకారం, భోజనం చేసిన తరువాత 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కెరలు లేని బబుల్ గమ్ నమలాలి. దీంతో, లాలాజలం ఉత్పత్తి పెరిగి పళ్లు శుభ్రమవుతాయి. కాబట్టి, బబుల్ గమ్ విషయంలో శరీరంలో కనిపించే మార్పులను అనుసరించి తగు నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు చెప్పేమాట.

మీ వినికిడి శక్తి కలకాలం నిలిచుండాలంటే ఇలా చేయండి!

Read Health and Latest News

Updated Date - Sep 29 , 2024 | 10:43 PM