బీర్ తాగుతారా? మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే!
ABN , Publish Date - Mar 22 , 2024 | 09:25 PM
మద్యంపానం గురించి ప్రజల్లో కొన్ని అపోహలు..డాక్టర్లు ఇస్తున్న వివరణ
ఇంటర్నెట్ డెస్క్: మద్యం ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా (Alcohol Consumption) ప్రమాదకరమేనని డబ్ల్యూహెచ్ఓ (WHO) తేల్చి చెప్పింది. అయినా, ఇంకా అనేక మందిలో అపోహలు మిగిలున్నాయి. బీర్ తాగితే ఏం కాదని, రోజుకు ఒక పెగ్గుతో వచ్చే ఆరోగ్యానికి (Health) మంచిదని కొందరు భావిస్తారు. ఇవన్నీ ప్రమాదకరమైన అపోహలని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. ఆల్కాహాల్ గ్రేడ్-1 కార్సినోజన్‌గా (క్యాన్సర్ కారకం) డబ్ల్యూహచ్ఓ చెప్పిన నేపథ్యంలో మద్యం బాటిళ్లపై కూడా సిగరెట్ ప్యాట్లలాగా హెచ్చరికలు ఉండాలని కూడా కొందరు వైద్యులు అంటున్నారు. మద్యపానం విషయంలో జనాల్లో పేరుకున్న కొన్ని అపోహలపై (Myths about alcohol Consumption) వివరణ ఇస్తున్నారు.
Health: త్వరలో హోలీ.. ఫుల్‌గా ఎంజాయ్ చేసే ముందు ఒక్కసారి ఇలా చేయండి..
బీర్ అనేది ఆల్కహాల్ కాదు..
ఈ భావన తప్పని వైద్యులు చెబుతున్నారు. బీర్ కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనో, ఆరోగ్యానికి మేలు చేస్తుందనో, లేదా బీర్ అసలు ఆల్కహాల్ కానేకాదనో అస్సలు భావించరాదని అంటున్నారు. బీర్ వల్ల కూడా ఆల్కహాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
ఆల్కహాల్ తాగకపోయినా కొందరు ఫ్యాటీ లివర్ బారిన పడతారు
ఆల్కహాల్ తాగని వారు కూడా ఫ్యాటీ లివర్ బారినపడతారు కాబట్టి అనారోగ్యానికి ఆల్కహాల్‌కు లంకె పెట్టొద్దని కొందరు అంటుంటారు. ఇది కూడా తప్పని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌కు మద్యపానంతో పాటూ ఊబకాయం కూడా ఓ కారణం కాబట్టి మద్యపానం విషయంలో ఇలాంటి అపోహలు తప్పని హెచ్చరిస్తున్నారు.
రోజుకు ఒక పెగ్గే తాగితే..
రోజుకు ఒక పెగ్గు తాగితే మంచిదని కొందరు భావిస్తుంటారు. ఇదీ తప్పుడు ఆలోచనేనని కొందరు అంటున్నారు. కొన్ని కేసుల్లో ఆరోగ్యానికి, మద్యపానానికి లంకె ఉన్నట్టు అనిపించినా ఆల్కహాల్‌తో ఆరోగ్యం మెరుగుపడినట్టు ఏ అధ్యయనంలోనూ రుజువు కాలేదని వైద్యలు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి