Hair Dye - Greying: హెయిర్ డై వాడితే జుట్టు నెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - Nov 23 , 2024 | 09:53 PM
హెయిర్ డైలు వాడితే జుట్టు చిన్నతనంలోనే నెరిసిపోతుందని అనేక మంది భావిస్తుంటారు. ఇలా నిజంగా జరుగుతుందా లేదా అనే విషయంలో వైద్యులు సవివరమైన సమాధానమే చెబుతున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఇంటర్నెట్ డెస్క్: నేటి యువతకు జుట్టుకు రంగు వేసుకోవడం పరిపాటిగా మారింది. తమను తాము కొత్తగా నిర్వచించుకునే క్రమంలో కొందరు తన జుట్టుకు రకరకాల రంగులు వేసుకుని ట్రెండీగా కనిపించాలని తహతహలాడతారు. అయితే, ఇలా హెయిర్ డైలు వాడితే చిన్నతనంలోనే జుట్టు నెరిసిపోతుందని కొందరు భయపడుతుంటారు. ఫలితంగా హెయిర్ డై వేసుకునేందుకే జంకుతారు. మరి హెయిర్ డైల వినియోగంతో జుట్టు నిజంగానే నెరిసిపోతుందా? అనే ప్రశ్నకు వైద్యులు సవివరమైన జవాబు చెబుతున్నారు (Health).
Hairloss: జుట్టూడిపోతోందా? ఈ లిమిట్ దాటనంత వరకూ టెన్షన్ వద్దు!
హెయిర్ డైలు, జుట్టు తెల్లబడటానికి మధ్య సంబంధం ఉన్నట్టు ఇంతవరకూ ఏ శాస్త్రపరిశోధనలోనూ రుజువు కాలేదని నిపుణులు చెబుతున్నారు. ‘‘హెయిర్ డైలు జుట్టు పైపొరను మాత్రమే ప్రభావితం చేస్తాయి, కుదుళ్లపై ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ కఠినమైన రసాయనాలు ఉన్న హెయిర్ డైలను వాడితే జుట్టు పొడిబారి పోతుంది. కానీ ఇది జుట్టు నెరవడానికి మాత్రం కారణం కాదు’’ అని ఓ డెర్మటాలజిస్టు వివరించారు.
అయితే, హెయిర్ కలరింగ్ సందర్భంగా బ్లీచ్ వాడితే మాత్రం కొంత వరకూ ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘‘బ్లీచ్ వినియోగించి చేసే హెయిర్ కలరింగ్ విధానంతో జుట్టు కుదుళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. శాశ్వత జుట్టు రంగులు లేదా ఇతర సెమీ పర్మెనెంట్ రంగులు వేసేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్, అమోనియా వంటి రసాయనాలను వినియోగిస్తారు. ఇవి జుట్టులోని మెలనిన్‌ను ఆక్సిడైజ్ చేస్తాయి. ఫలితంగా జుట్టు రంగులో శాశ్వత మార్పు వస్తుంది. పదే పదే ఇదే పద్ధతి వినియోగించిన సందర్భాల్లో జుట్టు రంగు మరింత పలచబడుతుంది. జుట్టు కుదుళ్లల్లో పేరుకునే హైడ్రోజన్ పెరాక్సైడ్ కారణంగా జుట్టు నెరిసిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ముదురు రంగులు వాడటం లేదా బ్లీచింగ్ అవసరం లేని తాత్కాలిక హెయిర్ డైస్‌ను వినియోగించడం చేయాలని సూచిస్తున్నారు.
Red Wine - Cancer: రెడ్ వైన్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రస్తుతం మర్కెట్‌లో విడుదలవుతున్న అనేక హెయిర్ డైస్‌లో జుట్టుపై ప్రభావం తగ్గించే యాంటీఆక్సిడెంట్స్ ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమోనియా రహిత ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎంచుకుంటే జుట్టు తెల్లబడే సమస్య నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
Health: వేడి నీటి స్నానాలతో ఈ సమస్యలు ఉన్నాయని తెలుసా?