Share News

Viral: 40 ఏళ్లు దాటాక హ్రస్వదృష్టి కనుమరుగవుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ABN , Publish Date - Oct 07 , 2024 | 01:45 PM

40 ఏళ్లు దాటాక హ్రస్వదృష్టి సమస్య తగ్గిపోతుందనుకోవడం తప్పని వైద్యులు చెబుతున్నారు. చత్వారం కారణంగా వచ్చే మార్పులతో దూరాన వస్తువులు సరిగా కనిస్తున్నాయన్న భావన కలుగుతుందని అంటున్నారు.

Viral: 40 ఏళ్లు దాటాక హ్రస్వదృష్టి కనుమరుగవుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: మైయోపియా లేదా హ్రస్వదృష్టి.. అంటే దూరంలో ఉన్న వస్తువులు కనబడకపోవడం. సాధారణంగా ఈ దృష్టిలోపం పిల్లలు లేదా యుక్త వయసు ఉన్న వారిలో కనిపిస్తుంటుంది. చాలా మంది జీవితాంతం ఈ దృష్టిలోపంతోనే గడిపేస్తారు. జీవనశైలి మార్పులు, కళ్లద్దాల వినియోగం, రెగ్యులర్ చెకప్‌లతో చూపును కొంతమేరకు కాపాడుకుంటారు. అయితే, వయసు పెరిగేకొద్దీ హ్రస్వదృష్టి తగ్గిపోతుందని కొందరు భావిస్తుంటారు. డాక్టర్లు మాత్రం ఈ భావన తప్పని చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ దూరపు చూపు మెరుగుపడుతున్నట్టు అనిపించడానికి మరో కారణం ఉందని వివరిస్తున్నారు (Health).

AGE Compounds: భారతీయులకు ఈ ఫుడ్స్ వల్లే షుగర్.. ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో వెల్లడి


ఏమిటీ హ్రస్వదృష్టి..

కాంతి తరంగాలు సరిగ్గా రెటీనాపై పడేలా చేయడంలో కంటి లెన్స్, కనుగుడ్డు ప్రాత కీలకం. వివిధ దూరాల్లోని వస్తువులను చూసేందుకు వీలుగా కంటి నిర్మాణం ఉంటుంది. అయితే, హ్రస్వ దృష్టి ఉన్న వారిలో కంటి నిర్మాణంలో స్వల్ప లోపం తలెత్తుతుంది. ఫలితంగా దూరాన ఉన్న వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు నేరుగా రెటీనా మీద పడవు. దీంతో అవి మసకగా కనిపిస్తాయి. ఇది కంటినిర్మాణంలో లోపం కాబట్టి దీనికి పరిష్కారం లేదు.

Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!


అయితే, చత్వారం వచ్చినప్పుడు లెన్స్‌కు సాగేగుణం తగ్గిపోతుంది. దీంతో కిరణాలను కన్ను సరిగా ఫోకస్ చేయలేదు. ఫలితంగా, దగ్గరిగా ఉన్న వస్తువులు మసకగా కనిపిస్తాయి. అదే సమయంలో దూరాన ఉన్న వస్తువులు బాగా కనిపిస్తున్నట్టు భావన కలుగుతుంది. ఇదంతా చత్వారం వల్ల కలిగే భావనే కానీ హ్రస్వదృష్టి తగ్గిపోయినట్టు కాదని వైద్యులు చెబుతున్నారు.

కాబట్టి, ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనలు పాటిస్తూ ఉంటే చత్వారం ఉన్నా జీవితంలో పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest News

Updated Date - Oct 07 , 2024 | 01:53 PM