Viral: జలుబు చేసినప్పుడు ముక్కు చీదుతున్నారా? అయితే..
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:00 PM
దిబ్బెడ వేసినప్పుడు చాలా మంది ముక్కు చీదుతుంటారు. ఈ విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తు్న్నారు. ఇందుకు కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఇది చలికాలం. దగ్గు, జలుబు, ముక్కు మూసుకుపోవడం వంటి అనేక సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో పడుకున్నప్పుడు ముక్కు మూసుకుపోతుంటుంది. ఇలాంటిప్పుడు చాలా మంది ముక్కు చీది ఉపశమనం పొందుతుంటారు. అయితే, ఇలా తరచూ ముక్కు చీదే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు (Health).
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ముక్కు చీదితే తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ ఆ తరువాత పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంది. సాధారణంగా ముక్కులోపలి పొరల్లో ఇన్‌ఫ్లమేషన్ తలెత్తినప్పుడు ముక్కు మూసుకుపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, ఎలర్జన్లు లేదా పొల్యూషన్ వల్ల ఈ పరిస్థితి తలెత్తొచ్చు. దీని వల్ల ముక్కులోపల మ్యూకస్ ఉత్పత్తి పెరిగి లీకైపోతుంది. ఇది గట్టిపడి ముక్కు దిబ్బెడ వేస్తుంది.
Indoor Pollution: ఎక్కువ సేపు వంటగదిలో గడుపుతున్నారా? ఎంతటి రిస్కో తెలిస్తే..
ఇలాంటి సందర్భాల్లో ముక్కు గట్టిగా చీదితే చెవికి ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కర్ణభేరికి గాయమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చెవిలో కాస్త నొప్పి అనిపించినా చీదడం మానేయాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా, రెండు రంధ్రాలతో ముక్కు చీదే ప్రయత్నం చేస్తే మధ్య చెవి మరింత దెబ్బతిని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు.
Intermittent Fasting: ఈ తరహా ఉపవాసంతో జుట్టుకు చేటు!
కాబట్టి ముక్కు దిబ్బెడ నుంచి ఉపశమనం కోసం శాలైన్ రిన్సెస్ ట్రై చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆవిరి పట్టడం కూడా సమస్యను కొంత వరకూ తగ్గిస్తుందట. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగితే మ్యూకస్ పలచబడి దిబ్బెడ తగ్గే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గదిలోని గాలిలో తేమశాతం పెంచే హ్యూమిడిఫయ్యర్‌ల వల్ల కూడా ఫలితం ఉందని అంటున్నారు. కాబట్టి, సమస్యను వద్యులకు చెప్పి వారి సూచనలు పాటిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటయాని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!