Share News

Lemon Juice: బరువు, బీపీ అదుపులో.. ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఇన్ని లాభాలా

ABN , Publish Date - Sep 26 , 2024 | 09:37 PM

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి ఉదయం లేచిన వెంటనే నిమ్మ రసాన్ని తాగటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసా. నిమ్మరసం వేడి నీళ్లలో కలుపుకొని ఉదయాన్నే తాగితే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..

Lemon Juice: బరువు, బీపీ అదుపులో.. ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఇన్ని లాభాలా

ఇంటర్నెట్ డెస్క్: నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి ఉదయం లేచిన వెంటనే నిమ్మ రసాన్ని తాగటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసా. నిమ్మరసం వేడి నీళ్లలో కలుపుకొని ఉదయాన్నే తాగితే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తాగితే జలుబు, ఇన్ఫెక్షన్లు దరి చేరవు. ఏడాది పొడవునా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

జీర్ణక్రియకు..

నిమ్మరసం జీర్ణవ్యవస్థను కండీషన్‌లో ఉంచుతుంది. ఉబ్బరం, ఛాతీలో మంట వంటి అజీర్తి లక్షణాలను తగ్గిస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.

బరువు అదుపులోకి..

బరువు తగ్గాలని భావించే వారు నిమ్మరసం తప్పకుండా తాగాలి. నిమ్మరసంతోపాటు రోజూ కొంత సమయాన్ని తేలికపాటి వ్యాయామానికి కేటాయిస్తే బరువు అదుపులో ఉంటుంది.


చర్మ ఆరోగ్యం

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. మూత్రవిసర్జన సాఫీగా జరుగుతుంది. చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.

శ్వాస..

నిమ్మరసం తాగితే శ్వాస తాజాగా ఉంటుంది. ఇందులో ఉండే ఆమ్లత్వం నోటిలోని బ్యాక్టీరియాను చంపి.. దుర్వాసనను మాయం చేస్తుంది. దంతాలపై ఉన్న ఎనామిల్‌ను రక్షించడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది.

గుండెకు..

నిమ్మరసంలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి . పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 26 , 2024 | 09:39 PM