Share News

Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!

ABN , Publish Date - Dec 10 , 2024 | 07:21 PM

రోజూ మేకప్ వేసుకునే వారికి అసలు ముఖంపై మేకప్ ఎంత సేపు ఉండొచ్చు? అన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. ఈ పరిమితి దాటితే చర్మం సంబంధిత సమస్యలు వస్తాయనా అని కొందరు ఆలోచిస్తుంటారు. అయితే, ఈ ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు.

Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో అనేక మందికి ముఖానికి మేకప్ వేసుకోవడం తప్పనిసరిగా మారింది. కార్పొరేట్ ప్రపంచంలో మహిళలతో పాటు పురుషులు కూడా మేకప్‌తో ఆఫీసులకు వెళుతున్నారు. ఇక గంటలకు గంటలు కెమెరాల ముందు గడిపేసే నటీనటుల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అసలు ముఖంపై మేకప్ ఎంత సేపు ఉండొచ్చు? అన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. ఈ పరిమితి దాటితే చర్మం సంబంధిత సమస్యలు వస్తాయనా అని కొందరు ఆలోచిస్తుంటారు. అయితే, ఈ ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు. ముఖంపై ఎక్కువ సేపు మేకప్ నిలిచి ఉంటే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు (Health).

Ghee - Skincare: చలికాలంలో నెయ్యిని ఇలా వాడితే అన్నీ బెనిఫిట్సే!


నిపుణులు చెప్పే దాని ప్రకారం, మేకప్ వేసుకోవడం ఎంత అవసరమో దాన్ని తొలగించడం కూడా అంతే ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్ తొలగించాలి. దీన్ని తొలగించకపోతే చర్మంలోని రంద్రాలు పూడుకుపోయి సహజసిద్ధమైన చర్మ సంబంధిత ప్రక్రియకు బ్రేకులు పడతాయి. చర్మంపై ముడతలు, అకాల వృద్ధాప్యం వచ్చేస్తాయి. ఎక్కువ సేపు ముఖంపై మేకప్ నిలిచి ఉంటే చర్మంపై దురదలు, ఎర్రబడటం, ఎడిపోయినట్టు మారడం, ఇతర సమస్యలు తప్పక వస్తాయి. దీర్ఘకాలంలో చర్మం రంగులో మార్పులు వస్తాయి. చర్మ ఆరోగ్యం కోసం వాడే ఇతర ఆయింట్‌మెంట్‌లను చర్మం పూర్తిగా పీల్చుకోలేని స్థితికి చేరుకుంటుంది.

Health: 25 ఏళ్లు దాటిన మహిళలకు ఫుడ్‌లో ఈ విటమిన్స్ తప్పనిసరి!

ఇక నిపుణులు చెప్పే దాని ప్రకారం, ముఖంపై మేకప్ 8 నుంచి 10 గంటల పాటు నిలిచి ఉండొచ్చు. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. అయితే, ఎంత సేపు మేకప్ నిలిచుండొచ్చనేది చర్మం తీరు, వయసు, మేకప్ ఉత్పత్తుల నాణ్యత, ఆయా వ్యక్తుల శరీర తత్వం వంటివాటిపై ఆధార పడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మేకప్ ఎక్కువ సేపు ఉంటే చర్మంపై ఉండే వివిధ రకాల ఆయిల్స్ మధ్య సమతౌల్యం దెబ్బతింటుందని అంటున్నారు. చర్మంపై గాలి పారేందుకు, కోలుకునేందుకు వీలుగా మేకప్‌ను తొలగించాలనేది నిపుణులు చెప్పే సూచన. మేకప్ తొలగిపోయాక దొరికే విశ్రాంతి కారణంగా చర్మ కణాలు మళ్లీ కోలుకుంటాయట.

Dietary supplements: ఆహారంలో పోషకాల కొరతా? ఇలా చేస్తే సరి.. ప్రముఖ న్యూట్రిషనిస్టు సలహా


ఇక ఎక్కువసేపు నిలిచుండే మేకప్‌తో సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాన్‌కొమెడోజెనిక్ ఉత్పత్తులు ఉన్న ప్రాడక్ట్స్‌నే వాడాలి. సన్ స్క్రీమ్ తప్పనిసరిగా వాడాలి. ఇక మేకప్ తొలగించాక కూడా చర్మానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలి. డబుల్ క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్, హైడ్రేషన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్స్, నియాసినమైడ్, హయాలురోనిక్ యాసిడ్ ఉన్న నారిషింగ్ సీరమ్‌లను మేకప్ తొలగించాక ముఖానికి రాసుకుంటే చర్మం త్వరగా కోలుకుంటుంది. వీటితో పాటు సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి కీలకం.

Read Latest and Health News

Updated Date - Dec 10 , 2024 | 07:21 PM