Side effects of Turmeric: అలర్ట్.. పసుపుతో ఇలాంటి ప్రమాదం ఉందని తెలుసా? | How Much Turmeric Is Too Much Know Its Devastating Effects On The Liver pcs spl
Share News

Side effects of Turmeric: అలర్ట్.. పసుపుతో ఇలాంటి ప్రమాదం ఉందని తెలుసా?

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:32 PM

అతిగా పసుపు తింటే కొన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపులో ఉండే లెడ్ వంటి కలుషితాల కారణంగా ఈ సమస్య వస్తుందని హెచ్చరిస్తున్నారు. లివర్, బైల్ సంబంధిత సమస్యలు ఉన్న వారు పసుపు తినకపోవడమే బెటరేది వైద్యుల అభిప్రాయం.

Side effects of Turmeric: అలర్ట్.. పసుపుతో ఇలాంటి ప్రమాదం ఉందని తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటకాల్లో పసుపు తప్పనిసరిగా వేస్తారు. ఆహారానికి మంచి రంగు, రుచి ఇవ్వడంతో పాటు ఔషధ గుణాలు (Health) ఉన్న పసుపును విరివిగా వాడతారు. పసుపులో ఉండే కుకుర్మిన్‌ అనే రసాయం ఈ ఔషధ గుణాలకు ప్రధాన కారణం. దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. దీంతో, శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, పసుపుతో క్యా్న్సర్ తగ్గిపోతుందని, లివర్‌కు మేలు చేస్తుందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంటుంది. అయితే, పసుపును అతిగా వాడితే అనేక అనారోగ్యాలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు (Side Effects of Turmeric).

Health: పిల్లల్లో డయాబెటిస్.. ఈ అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయొద్దు!


రోజుకు ఎంత పసుపు తినాలి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, శరీరం బరువులో ప్రతి కేజీకి 3 మిల్లీగ్రాముల చొప్పున పసుపు తినాలి. ఇతర అధ్యయనాల ప్రకారం 500 మిల్లీగ్రాముల పసుపును రోజుకు రెండు సార్ల చొప్పున తింటే ఇన్‌ఫ్లమేషన్ వంటివి తగ్గుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

అతిగా తింటే అనర్థాలు..

వైద్యుల సూచనల కంటే ఎక్కువ మోతాదులో పసుపు తింటే పలు అనారోగ్యాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే లెడ్ వంటి కలుషితాల కారణంగానే ఈ సమస్య వస్తుందని అంటున్నారు. ఇక పసుపు సప్లిమెంట్లతో కాలేయం పాడయ్యే ప్రమాదం కూడా ఉందని మెచ్చరిస్తున్నారు. ఇక హెపటైటిస్ లేదా బైల్ డక్ట్‌లో అడ్డంకులు ఉన్న వారు పసుపును అస్సలు తినకూడదని చెబుతున్నారు. పసుపుతో పాటు బ్లాక్ పెప్పర్ కారణంగా అమెరికాలో లివర్ అనారోగ్యాల కేసులు పెరుగుతున్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. పసుపు వినియోగానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు ఏవీ లేవుకాబట్టి పరిమితంగానే దీన్ని వినియోగించాలని సూచిస్తున్నారు.


ఇక రోజూ ఆహారానికి పసుపు పొడి జతచేసేవారు ప్రత్యేకంగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక గర్భవతులు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులు, కీమోథెరపీ తీసుకుంటున్న వారు, లివర్ లేదా బైల్ డక్ట్ సంబంధిత సమస్యలు ఉన్న వారు, రక్తం పలుచబడే మందులు తీసుకునే వారు కూడా పసుపు తినకూడదు.

Read Health and Telugu News

Updated Date - Sep 06 , 2024 | 12:35 PM