Cigarettes - Smoking: టీ, సిగరెట్ అలవాటుందా? ఎలాంటి ఇబ్బందులొస్తాయో తెలిస్తే..
ABN , Publish Date - Dec 13 , 2024 | 09:31 PM
చాలా మంది టీతో పాటు సిగరెట్ అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాట్లు హద్దు మీరితే కలిగే ఇబ్బందులపై మాత్రం అంత అవగాహన ఉండదు. కానీ ఈ రెండిటి వల్లా పలు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది టీతో పాటు సిగరెట్ అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాట్లు హద్దు మీరితే కలిగే ఇబ్బందులపై మాత్రం అంత అవగాహన ఉండదు. కానీ ఈ రెండిటి వల్లా పలు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు (Health).
వాస్తవానికి ఓ మోస్తరుగా టీ తాగడంతో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ పరిమితి దాటితే మాత్రం ఇబ్బందులు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. టీలో కెఫీన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఓ మోస్తరు కెఫీన్‌తో పెగుల్లో కదలికలు పెరుగుతాయి. మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, అతిగా టీ తాగితే మాత్రం డీహైడ్రేషన్ మొదలవుతుంది. ఒంట్లో నీరు తగ్గి పేగుల్లోని వ్యర్థాలు మరింతగా గట్టిపడి మలబద్ధకం పెరుగుతుంది.
Cancer Screening test: క్యాన్సర్ ముప్పు! తప్పనిసరిగా చేయించుకోవాల్సిన 5 స్క్రీనింగ్ టెస్టులు
కెఫీన్ డైయూరెటిక్‌గా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంటే, దీనితో మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. ఇలా మూత్రం ద్వారా నీరు కోల్పోతే ఆ ప్రభావం నేరుగా జీర్ణవ్యవస్థపై పడుతుంది. మలవిసర్జనలో ఇబ్బందులు మొదలవుతాయి. ఇక టీలో ఉండే పాల వల్ల లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ ఉన్న వారు కూడా మరింత ఇబ్బంది పడతారు. కడుపులో ఉబ్బరం, మలబద్ధకంతో సతమతమవుతారు.
ధూమపానం కూడా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సిగరెట్లలో ఉండే నికోటిన్ అనే రసాయనం నాడీ వ్యవస్థను ప్రేరేపించి పేగుల్లో కదలికలను పెంచుతుంది. అయితే, దీర్ఘకాలిక పాటు ధూమపానం అలవాటు ఉన్న వారి పేగుల్లో నికొటీన్ కారణంగా హితకర బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు ఈ బ్యాక్టీరియా ఎంతో కీలకం. దీంతో, నికోటిన్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!
నికోటిన్ కారణంగా పేగులకు రక్తప్రసరణ కూడా తగ్గి వాటి పనితీరు మందగిస్తుంది. కాలం గడిచేకొద్దీ ఈ పరిస్థితి పేగుల్లోపలి కణజాలంపై ప్రతికూల ప్రభావం ఎక్కువవుతుంది. చివరకు కదలికలు తగ్గి మలవిసర్జన ఇబ్బందికరంగా మారుతుంది. ధూమపానంతో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.