Share News

సాయం సమయాల్లో...

ABN , Publish Date - Aug 25 , 2024 | 08:55 AM

వ్యాయామం అంటే.. ఉదయాన్నే లేచి చెయ్యాలేమో అనుకుంటారు చాలామంది. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పేశాయి ఇటీవల కొన్ని అధ్యయనాలు. నిజానికి ఉదయం కన్నా సాయంత్రం పూట (5 నుంచి రాత్రి 8 దాకా) చేసే వ్యాయామాలే చక్కని ప్రయోజనాలు కలిగిస్తాయట. ఆ విశేషాలే ఇవి...

సాయం సమయాల్లో...

వ్యాయామం అంటే.. ఉదయాన్నే లేచి చెయ్యాలేమో అనుకుంటారు చాలామంది. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పేశాయి ఇటీవల కొన్ని అధ్యయనాలు. నిజానికి ఉదయం కన్నా సాయంత్రం పూట (5 నుంచి రాత్రి 8 దాకా) చేసే వ్యాయామాలే చక్కని ప్రయోజనాలు కలిగిస్తాయట. ఆ విశేషాలే ఇవి...

సాయంత్రం వర్కవుట్‌ అనేది ఒత్తిడిని తగ్గించడానికి ఒక గొప్ప మార్గం. ముఖ్యంగా టెకీలకు ఇది స్ట్రెస్‌బస్టర్‌లా పనిచేస్తుంది.


- ఊబకాయం, అధిక బరువుతో బాధ పడేవాళ్ళు సాయంత్రం పూట వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో పెట్టుకోవచ్చు. గుండె జబ్బులు, అకాల మరణాల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది.

- ఉదయం కన్నా సాయంత్రం సమయంలోనే వ్యాయామాలను ఉత్సాహంగా చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు ముగించుకుని ప్రశాంతంగా వర్కవుట్స్‌ చేయడం వల్ల తర్వాతి రోజు పనిపై శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది.

- సాయంత్రం వేళ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల బలహీనత, అలసట సమస్య పోతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయార వుతాయి.


- రాత్రిళ్లు నిద్ర రాని వారు సాయంత్రం వ్యాయామం చేేస్త మంచి ఫలితం ఉంటుంది. ఫోన్‌, కంప్యూటర్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నవారి కళ్లు, శరీరం బాగా అలసిపోతాయి. ఇలాంటివారు సాయంత్రం వేళ వ్యాయామం చేేస్త... రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది.

- ఇంట్లోనే సులువుగా...

పుషప్స్‌ (10 సార్లు): చేతుల్ని నేలపై గట్టిగా అదుముతూ బాడీ మొత్తాన్ని నిటారుగా పైకి లేపాలి. కేవలం చేతుల పైనే ఉంటూ తలను నేలకు ఆనిస్తూ కిందికీ, పైకి లేవాలి.


nani1.jpg

క్రంచెస్‌ (5 సార్లు): నేల మీద వెల్లకిలా పడుకుని మో చేతులను తల వెనుక పెట్టుకోవాలి. కాళ్లను 90 డిగ్రీల వరకు మడిచి, తల భుజాన్ని వీలైనంత పైకి లేపి ఎడమ మోచేత్తో కుడి మోకాలిని తాకాలి. తర్వాత కుడి మోచేత్తో ఎడమ మోకాలిని తాకాలి.

జంపింగ్‌ జాక్స్‌ (60 సార్లు): ముందుగా కాళ్ళు దగ్గరకి పెట్టి నిల్చోవాలి. ఆపై గాల్లోకి గెంతేటప్పుడు కాళ్ళను ఎడంగా చాపి రెండు చేతులు పైకి ఎత్తాలి. చేతులు తిరిగి దింపేటప్పుడు కాళ్లను దగ్గరకు జరపాలి.

వి హోల్డ్‌ (50 సెకన్లు): నేలపై వెల్లకిలా పడుకుని చేతులను తలపైకి నిటారుగా చాపి నేలకు ఆనించాలి. కాళ్లు పూర్తిగా నేలకు తాకాలి. ఇప్పుడు నెమ్మదిగా పైకి లేస్తూ కాళ్లనూ పైకి లేపాలి. మెల్లగా చేతులతో కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇంగ్లీషు అక్షరం ‘వి’ భంగిమలో కాసేపు ఉండి తిరిగి యథాస్థానానికి వచ్చేయాలి.


సిజర్స్‌ కిక్స్‌ (30 సార్లు): నేలపై నిటారుగా పడుకుని కాళ్లను 45 డిగ్రీల వరకు గాల్లోకి లేపాలి.

ఆపై కత్తెర మాదిరిగా కాళ్లను ఒకటి తర్వాత మరొకటి కిందకి, పైకి కదపాలి.

స్క్వాట్స్‌ (20 సార్లు): నిటారుగా నిల్చొని ఆపై హిప్‌ బాగాన్ని వెనక్కి లాగి, కుర్చీలో కూర్చున్నట్లు మోకాళ్లను మడవాలి. తర్వాత పైకి లేచి కుడి చేయితో ఎడమ కాలి బొటన వేలు, ఎడమ చేయితో కుడి కాలి బొటన వేలును తాకాలి.

జాగ్రత్తలివి...


- సాయంత్రం వేళ వ్యాయామం చేసే వారు ఖాళీ కడుపుతోనే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే వ్యాయామం చేయడానికి కొన్ని గంటల ముందు ఎలాంటి హెవీ ఫుడ్‌ తినకూడదు.

- వ్యాయమం చేయడం వల్ల మెటబాలిజం రేటుతో పాటుగా గుండె కొట్టుకునే వేగం బాగా పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత కొద్దిసేపటి వరకు నిద్రపోకూడదు.

Updated Date - Aug 25 , 2024 | 08:55 AM