Intermittent Fasting: ఈ తరహా ఉపవాసంతో జుట్టుకు చేటు!
ABN , Publish Date - Dec 16 , 2024 | 10:42 PM
బరువు తగ్గాలనుకునే వారు ఇటీవల అనుసరిస్తున్న అనేక మార్గాల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి. అయితే, ఈ తరహా ఉపవాసం జుట్టు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గాలనుకునే వారు ఇటీవల అనుసరిస్తున్న అనేక మార్గాల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి. అయితే, ఈ తరహా ఉపవాసం జుట్టు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు (Health).
Health: ఆరోగ్యవంతుల్లోనూ కార్డియాక్ అరెస్టు! కారణాలు ఇవే..
ఏమిటీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్?
రోజులో తినాల్సిన మొత్తం ఆహారాన్ని కొన్ని గంటల్లో పూర్తి చేసి మిగతా సమయవంతా ఏమీ తినకుండా ఉండటమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇలాంటి ఉపవాసాలు ఉంటున్న వారిని లోతుగా అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు పలు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఈ తరహా ఉపవాసంతో బరువు తగ్గడంతో పాటు ఇన్సులీన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ వ్యాధి అదుపులో ఉండటం కూడా గుర్తించారు. అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 12 శాతం మంది ఈ ఉపవాసంతో లాభం పొందినట్టు చెప్పుకొచ్చారు.
Cigarettes - Smoking: టీ, సిగరెట్ అలవాటుందా? ఎలాంటి ఇబ్బందులొస్తాయో తెలిస్తే..
అయితే, ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ తరహా ఉపవాసం ప్రతికూల ఫలితాలు కూడా బయటపడ్డాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఎలుకలపై ఈ ఉపవాసాన్ని ప్రయోగించారు. అయితే, బరువుకు సంబంధించిన మనుషుల్లో కనిపించిన ఫలితాలే ఎలుకల్లో కనిపించినప్పటికీ జుట్టు ఎదుగుదలపై మాత్రం ప్రతికూల ప్రభావం కనిపించింది. జుట్టు కుదుళ్లల్లోని స్టెమ్ సెల్స్ ఉపవాసాల కారణంగా కనుమరుగైపోయినట్టు గుర్తించారు. మనుషుల్లో కూడా దాదాపు ఇలాంటిదే, కొంత తక్కువ తీవ్రతతో జరుగుతూ ఉండొచ్చన్న అంచనాకు పరిశోధకులు వచ్చారు. అయితే, మనుషుల తీరు కొంత భిన్నమైనది కాబట్టి ఈ తరహా ఉపవాసంతో కలిగి ఎఫెక్ట్స్‌పై మరింత విస్తృత అధ్యయనం జరగాల్సి ఉందని శాస్త్రజ్ఞులు చెప్పుకొచ్చారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో రకాలు..
ఈ తరహా ఉపవాసాలు కొందరు ఒకే రోజుకు పరిమితం చేస్తే మరికొందరు వారం రోజులకు విస్తరిస్తారు. అయితే, ఈ ఉపవాసాలతో తమ ఆరోగ్యం మెరుగుపడినట్టు ఇప్పటికే అనేక మంది తెలిపారు. జీవక్రియలు వేగవంతమై మరింత అలర్ట్‌గా ఉన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉదంతంపై ఫిట్‌నెస్ ఔత్సాహికుల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!