Dietary supplements: ఆహారంలో పోషకాల కొరతా? ఇలా చేస్తే సరి.. ప్రముఖ న్యూట్రిషనిస్టు సలహా
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:09 PM
నేటి బిజీ జీవితాల్లో సమతులాహారం తీసుకోవడం పెద్ద సవాలుగా మారిపోయింది. దీంతో, ఆహారంలో తక్కువగా ఉన్న పోషకాలను కొందరు రోజూ డైటరీ సప్లిమెంట్స్‌తో భర్తీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూట్రిషనిస్టు ఒకరు ఇన్‌స్టా వేదికగా తాను రోజూ ఎలాంటి డైటరీ సప్లిమెంట్స్ తిసుకుంటున్నదీ వివరించారు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి బిజీ జీవితాల్లో సమతులాహారం తీసుకోవడం పెద్ద సవాలుగా మారిపోయింది. దీంతో, ఆహారంలో తక్కువగా ఉన్న పోషకాలను కొందరు రోజూ డైటరీ సప్లిమెంట్స్‌తో భర్తీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూట్రిషనిస్టు ఒకరు ఇన్‌స్టా వేదికగా తాను రోజూ ఎలాంటి డైటరీ సప్లిమెంట్స్ తిసుకుంటున్నదీ వివరించారు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఆహారం ద్వారా అందాలని ఆమె చెప్పారు. అయితే, నేటి బిజీ లైఫ్ కారణంగా పోషకాహారం తినలేని వారు కొన్ని పోషకాలను డైటరీ సప్లిమెంట్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చని చెబుతున్నారు. తానూ ఇదే చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె వివరణ ప్రకారం రోజూ తినాల్సిన డైటరీ సప్లిమెంట్స్ ఏవంటే (Health)...
Mushrooms: రోజూ కేవలం 5 పుట్టగొడుగులను తింటే కలిగే బెనిఫిట్స్ ఏవంటే..
గుండె, మెదడు ఆరోగ్యానికి కీలకమైన ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ (ఒమెగా 3, 6, 9) ను డైటరీ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు.
ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి బలోపేతానికి, భావోద్వేగ నియంత్రణకు కీలకమైన విటమిన్ డీని కూడా తాను సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటానని ఆమె వివరించారు.
కండరాలు రిలాక్స్ అయ్యేందుకు, మంచి నిద్రపట్టేందుకు, శక్తి ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ పనితీరుకు అవసరమైన మెగ్నీషియంను కూడా సప్లిమెంట్స్ రూంలో తీసుకోవచ్చు.
రోగ నిరోధక శక్తి, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ సీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. కాబట్టి, దీన్ని కూడా డైటరీ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చట.
శరీరంలో శక్తి ఉత్పత్తికి, ఎర్రరక్త కణాలు, ఆక్సీజన్ సరఫరాకు అవసరమైన ఐరన్‌ను కూడా డైటరీ సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చని ఆమె చెప్పారు. మహిళలకు ఇది మరింత ఉపయుక్తమని పేర్కొన్నారు.
Tea: టీని తాగడంతో పాటు ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా?
‘‘పోషకాహారానికి డైటరీ సప్లిమెంట్స్ ప్రత్యామ్నాయం కాదు. వీటిని సమతులాహారానికి జతగా మాత్రమే చూడాలి. అయితే, ఏరకమైన సప్లిమెంట్స్ తీసుకునేముందైనా వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి’’ అని అని రాసున్న క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేశారు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఆహారం ద్వారా అందడం అంత సులభం కాదు కాబట్టి డైటరీ సప్లిమెంట్స్ వైపు అనేక మంది మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
Weekend Drinking: దంపతుల లివర్ చిత్రాలు షేర్ చేసిన డాక్టర్! విషయమేంటో తెలిసి జనాలు షాక్!