Obesity: పురుషులకు అలర్ట్! ఊబకాయంతో టెస్టెస్టిరాన్ హార్మోన్ తగ్గుదల!
ABN , Publish Date - Oct 01 , 2024 | 08:27 AM
ఊబకాయం కారణంగా టెస్టెస్టిరాన్ హార్మోన్ స్థాయిలు, లైగింకాసక్తి, స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో తాజాగా ఓ అధ్యయనం ప్రచురితమైంది.
ఇంటర్నె్ట్ డెస్క్: ఊబకాయంతో అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇది హృద్రోగాలు, డయాబెటిస్, వంటి దీర్ఘకాలిక ప్రమాదకర రోగాలకు కారణమవుతోంది. అయితే, పురుషుల్లో ఊబకాయంతో మరిన్ని సమస్యలు కలుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఊబకాయం కారణంగా టెస్టెస్టిరాన్ హార్మోన్ స్థాయిలు, లైంగికాసక్తి, స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో తాజాగా ఓ అధ్యయనం ప్రచురితమైంది (Health).
ప్రెగ్నెంట్ మహిళలు కాఫీ తాగొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఎలుకలపై పరిశోధన ద్వారా ఊబకాయం ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఒబెసిటీ కారణంగా మెదడులో కొన్ని దీర్ఘకాలిక మార్పులు సంభవిస్తున్నట్టు గుర్తించారు. పునరుత్పత్తి, ఆకలిని నియంత్రించే మెదడు వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు. ఊబకాయం ఉన్నవాళ్లల్లో పునరుత్పత్తి సమస్యలు కూడా తలెత్తడానికి కారణం ఇదే అయ్యుండొచ్చని వివరించారు (Obesity Linked With Reduced Testosterone And Low Sperm Count says Study).
అలర్ట్.. రోజూ బబుల్ గమ్ నమిలితే జరిగేది ఇదే!
ఒబెసిటీ కారణంగా టెస్టెస్టిరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా కండరాలు బలహీనమవుతాయి. విషయావగాహన చేసుకునే మెదడు సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. పునరుత్పత్తి, ఆకలిని నియంత్రించి బ్రెయిన్ సర్క్యూట్‌లపై ఊబకాయం ప్రభావం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊబకాయంతో బాధపడుతున్న ఎలుకల మెదడులో టెస్టెస్టిరాన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఎల్ హెచ్ సిగ్నల్స్ తగ్గిపోయినట్టు ఈ పరిశోధనలో తేలింది. దీంతో, ఈ హార్మోన్ స్థాయి తగ్గడంతో పాటు శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గిందట. అదే సమయంలో ఆయా భాగాలను నేరుగా ప్రేరేపించినప్పుడు టెస్టెస్టిరాన్, స్పెర్మ్ కౌంట్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. అంటే, ఊబకాయం కారణంగా మెదడులో.. పునరుత్పత్తి వ్యవస్థను ప్రేరేపించే సామర్థ్యం తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ! ఎందుకంటే..
మెదడులోకి కిస్పెప్టిన్ నాడీ కణాలపై ఊబకాయం ప్రభావం ఉన్నట్టు తేలింది. దీర్ఘకాలిక ఊబకయాంతో ఈ నాడీ కణాల పనితీరు మందగిస్తుందట. మనుషులతో పాటు జంతువుల్లో కూడా ఊబకాయం ఇదే తరహా ప్రభావం చూపిస్తోందని అధ్యయనకారులు తేల్చారు. ఇటీవల కాలంలో పశువుల్లో పునరుత్పత్తి కుంటుపడటానికి ఊబకాయం ఓ కారణం కావచ్చని చెబుతున్నారు. ఇక ఆరోగ్యకరమైన జంటల్లో కూడా గర్భధారణ ఆలస్యం కావడానికి ఊబకాయం ప్రభావం ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?
Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!