Health: భోజనం చేశాక స్నానం చేస్తున్నారా? ఇలా చేస్తే సమస్యలు తప్పవు!
ABN , Publish Date - Oct 15 , 2024 | 09:02 PM
కొందరికి భోజనం చేశాక స్నానం చేసే అలవాటు ఉంటుంది. దీని వల్ల సేదతీరిన ఫీలింగ్ కలుగుతుందని చెబుతుంటారు. అయితే, ఈ అలవాటుతో కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరికి భోజనం చేశాక స్నానం చేసే అలవాటు ఉంటుంది. దీని వల్ల సేదతీరిన ఫీలింగ్ కలుగుతుందని చెబుతుంటారు. అయితే, ఈ అలవాటుతో కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు (Health) హెచ్చరిస్తున్నారు.
వైద్యులు చెప్పే దాని ప్రకారం, జీర్ణవ్యవస్థ పనితీరును స్వయంచోదిత నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఇందులో ప్రధాన శాఖ అయిన సహసహానుభూత నాడీ వ్యవస్థ నియంత్రణలో జీర్ణక్రియ ఉంటుంది. భోజనం చేసిన తరువాత ఈ నాడీ వ్యవస్థ క్రియాశీలకమైన జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ పెంచి వేగంగా ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే, భోజనం తరువాత వెంటనే చేసే స్నానం ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Coconut Oil: రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!
ఒంటిపై పడే వేడి నీళ్ల కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో శరీరాన్ని చల్లబరిచేందుకు చర్మంలోని రక్తనాణాలాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. అలా చర్మం, రక్తం ద్వారా శరీరంలోని వేడి బయటకు పోతుంది. ఈ క్రమంలో జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ తగ్గి అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా అన్నం అరగకపోయినట్టు ఉండటం, గ్యాస్ ఏర్పడటం వంటి పలు ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
Cakes: కేక్ అంటే ఇష్టపడే వారికి నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే!
భోజనం తరువాత వేడి నీటి స్నానం తాలూకు ప్రభావం నాడీవ్యవస్థపై కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా సాగడంలో వేగస్ నాడి కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థకు రక్తసరఫరా తగ్గినప్పుడు వేగస్ నాడి కూడా జీర్ణక్రియపై పట్టు కోల్పోతుందని ఫలితంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో దీని వల్ల మాల్‌అబ్సార్ప్‌షన్ సిండ్రోమ్ వస్తుంది. శరీరం పూర్తిస్థాయిలో పోషకాలను గ్రహించలేక సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, భోజనం తరువాత స్నానం చేద్దామనుకునే వారు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!