Stomach Noise: పొట్ట నుంచి విచిత్ర శబ్దాలు వస్తున్నాయా.. కారణం ఇదే కావచ్చు
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:15 PM
కొన్నిసార్లు ఆకలి వేసినప్పుడు ఇలా జరుగుతుంది. కానీ తరచూ పొట్ట ఇలాగే ఉంటుంటే అసలు కారణం తెలుసుకోవాలి. లేదంటే అది అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక్కోసారి పొట్ట నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయి. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో పొట్ట నుంచి ఇలాంటి శబ్దాలు బయటకు వినిపస్తే అసౌకర్యానికి గురవుతుంటారు. కొన్నిసార్లు ఆకలి వేసినప్పుడు ఇలా జరుగుతుంది. కానీ తరచూ పొట్ట ఇలాగే ఉంటుంటే అసలు కారణం తెలుసుకోవాలి. లేదంటే అది అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణం అయ్యేందుకు..
మనం తిన్న ఆహార కణాలను విచ్ఛిన్నం చేయడానికి శరీరం పలు రకాల ఎంజైమ్‌లను విడుదల చేస్తుంటుంది. జీర్ణక్రియ జరుగుతున్న సమయంలో ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి. ఆహారం జీర్ణమయ్యే సమయంలో కడుపు పేగుల నుండి ఈ శబ్దం వస్తుందని నమ్ముతారు. దీనిని సాధారణ ప్రక్రియగానే భావించాలి. పేగులు ఖాళీగా ఉండటం వల్ల మనం ఆహారం తీసుకన్నప్పుడు ఈ ప్రదేశం నుంచి ముందుకు వెళ్తుంది కాబట్టి ఇలా .జరుగుతుందనుకుంటారు. కానీ, కొన్ని సార్లు ఇది అధికంగా అనిపిస్తే, ఎంతకీ కడుపు శబ్దాలు ఆగకపోతే తీవ్రమైన అనారోగ్యంగా భావించి జాగ్రత్త పడాలి.
తీవ్ర లక్షణాలు..
క్రోన్స్ వ్యాధి, ఆహార అలర్జీలు, విరేచనాలు, పేగు రక్తస్రావం, పెద్ద పేగు వాపు వల్ల కూడా పొట్టలో పుండ్ల వల్ల కూడా రావచ్చు. పొత్తికడుపులో నిరంతరం శబ్దం వస్తుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. వైద్యులు లక్షణాలు చూసి సరైన రోగనిర్ధారణ, చికిత్స చేయగలరు. దీంతో త్వరగా కోలుకోవచ్చు. ఆ తర్వాత మందుల ఖర్చు ఉంటుంది. పొట్ట నుండి వచ్చే శబ్దాన్ని ఆపడానికి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి.
సింపుల్ రెమిడీ..
నీరు దాహాన్ని తీర్చడంతోపాటు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. నీరు కడుపుని మూసివేయడానికి సహాయపడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నా పొట్టలోంచి శబ్దం వస్తుందని కూడా అంటారు. ఆకలి వల్ల కూడా శబ్దాలు వస్తున్నాయంటే ఏదో ఒకటి తినాల్సిందే. తిన్న తర్వాత ఈ శబ్దాలను ఆపేయవచ్చు. కడుపు సమస్యలకు తగినంత తాగునీరు కూడా చక్కటి పరిష్కారం. అదనంగా, పుదీనా, అల్లం, మెంతులతో చేసిన హెర్బల్ టీ మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మీ పేగు కండరాలను రిలాక్స్ చేస్తుంది. మరిన్ని సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
ఇవి కూడా చదవండి...
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా
Read Latest AP News And Telugu News