Share News

Health: 25 ఏళ్లు దాటిన మహిళలకు ఫుడ్‌లో ఈ విటమిన్స్ తప్పనిసరి!

ABN , Publish Date - Dec 09 , 2024 | 05:07 PM

25 ఏళ్ల తరువాత మహిళల శరీరంలో పలు మార్పులు ప్రారంభమవుతాయి. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం సాధించే క్రమంలో ఒత్తిడులు, బరువు బాధ్యతలు ఎక్కువవుతాయి. ఇలాంటి కీలక దశలో పోషకాహారం, ఎక్సర్‌సైజులను నిర్లక్ష్యం చేస్తే విపరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తు్న్నారు.

Health: 25 ఏళ్లు దాటిన మహిళలకు ఫుడ్‌లో ఈ విటమిన్స్ తప్పనిసరి!

ఇంటర్నెట్ డెస్క్: మహిళలకు ఒక్కో వయసులో కొన్ని విటమిన్లు ఆరోగ్యానికి కీలకంగా మారతాయి. విటమిన్లు అందరికీ అవసరమే అయినా మహిళల ఆరోగ్యంలో ఇవి మరింత కీలక పాత్ర పోషిస్తాయి. 25 ఏళ్ల తరువాత మహిళల శరీరంలో పలు మార్పులు ప్రారంభమవుతాయి. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం సాధించే క్రమంలో ఒత్తిడులు, బరువు బాధ్యతలు ఎక్కువవుతాయి. ఇలాంటి కీలక దశలో పోషకాహారం, ఎక్సర్‌సైజులను నిర్లక్ష్యం చేస్తే విపరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తు్న్నారు. నిపుణుల ప్రకారం, 25 దాటిన మహిళల ఆహారంలో కొన్ని విటమిన్స్ తప్పనిసరిగా ఉండాలి (Health). అవేంటంటే..

Dietary supplements: ఆహారంలో పోషకాల కొరతా? ఇలా చేస్తే సరి.. ప్రముఖ న్యూట్రిషనిస్టు సలహా


విటమిన్ డీ

ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్లను శరీరం సులువుగా గ్రహించేందుకు విటమిన్ డీ అవసరం. మహిళల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్ల ప్రాత ఎక్కువ కాబట్టి విటమిన్ డీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చేసుకోవాలి. ఫార్టిఫైడ్ పాలు, గుడ్లు, సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్‌లో ఇది పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ బీ12

ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకమైన విటమిన్ బీ12 మహిళ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ విటమిన్ లోపం తలెత్తితే మెగాలోబ్లాస్టిక్ అనేమియా అనే రక్తహీనత తలెత్తుతుంది. సంతానోత్పత్తికి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులను అడ్డుకునేందుకు కూడా ఈ విటమిన్ కీలకం

విటమిన్ సీ

మహిళలకు అవసరమైన అతి ముఖ్య విటమిన్లలో ఇది కూడా ఒకటి. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు కాబట్టి ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాముల విటమిన్ సీ కావాలి. ఇది రక్తపోటు, కొలెస్టెరాల్ స్థాయిలు నియంత్రించేందుకు అవసరం. వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు అడ్డుకునేందుకు కూడా ఇది కీలకం. విటమిన్ సీ సమృద్ధిగా తీసుకుంటే ఐరోన్ లోపం తలెత్తే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. నిమ్మ జాతికి చెందిన పండ్లు, కీవీలు, వంటి పళ్లల్లో ఈ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.

Mushrooms: రోజూ కేవలం 5 పుట్టగొడుగులను తింటే కలిగే బెనిఫిట్స్ ఏవంటే..


విటమిన్ ఈ

యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న విటమిన్ ఈ చర్మ ఆరోగ్యానికి కీలకం. అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణంగా చర్మానికి జరిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా బలోపేతమయ్యేలా చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇతర అసౌకర్యాల నుంచి కూడా విటమిన్ ఈ ఉపశమనం కలిగిస్తుంది. విత్తనాలు, గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ కే

బ్లడ్ క్లాటింగ్‌కు కీలకమైన విటమిన్ కే గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికీ ఇది కీలకం. మహిళల్లో ఉదయం పూట కలిగే అసౌకర్యాల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మెదడు ఆరోగ్యానికీ ఇది అవసరమే. ఆకు కూరలు, ఆవాకాడో లాంటి పండ్లు, చేపలు, లివర్, మాంతం గుడ్లల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.

Weekend Drinking: దంపతుల లివర్ చిత్రాలు షేర్ చేసిన డాక్టర్! విషయమేంటో తెలిసి జనాలు షాక్!

Latest and Health News

Updated Date - Dec 09 , 2024 | 05:07 PM