Share News

Cancer Screening test: క్యాన్సర్ ముప్పు! తప్పనిసరిగా చేయించుకోవాల్సిన 5 స్క్రీనింగ్ టెస్టులు

ABN , Publish Date - Dec 13 , 2024 | 06:20 PM

క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే కొన్ని పరీక్షలను వైద్యులు సూచిస్తున్నారు. ఇవి క్రమం తప్పకుండా ఏడాదికోసారి చేయించుకుంటే ఆరోగ్యాన్ని పదికాలాల పాటు జాగ్రత్తగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.

Cancer Screening test: క్యాన్సర్ ముప్పు! తప్పనిసరిగా చేయించుకోవాల్సిన 5 స్క్రీనింగ్ టెస్టులు

ఇంటర్నె్ట్ డెస్క్: మరి కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగిసిపోతుంది. వచ్చే ఏడాది ఏం చేయాలనేదానిపై ఇప్పటికే జనాలు ప్లాన్స్ వేసేస్తున్నారు. అయితే, ఆరోగ్య జాగ్రత్తలపై దృష్టిపెట్టిన వారు కచ్చితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఇనుమడిస్తాయని చెబుతున్నారు (Health).

Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!

క్యాన్సర్ పరీక్షలతో ప్రయోజనాలు

క్యాన్సర్‌ వ్యాధి తొలి దశల్లో ఉండగానే గుర్తిస్తే అది ముదరకుండా గట్టి చర్యలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎంత ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తే చికిత్స ప్రయోజనం అంత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. బ్రెస్ట్, కొలాన్, లంగ్స్ క్యాన్సర్ల విషయంలో ఈ పరీక్షల ప్రాధాన్యత మరింత ఎక్కువని వివరించారు. వైద్యులు చెప్పేదాని ప్రకారం, క్రమం తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి కచ్చితంగా కొన్ని క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


మామోగ్రామ్

బ్రెస్ట్ ఎక్స్‌రేతో క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించొచ్చు. క్రమం తప్పకుండా ఏడాదికి ఓసారి ఈ పరీక్షలు చేయించుకుంటే బ్రెస్ట్‌లో వచ్చే మార్పులను వైద్యులు సులువుగా గుర్తిస్తారు. ఈ విధానంలో క్యాన్సర్ రాకడను మూడేళ్ల ముందుగానే గుర్తించే అవకాశం ఉందట. కుటుంబంలో క్యాన్సర్ కేసులు ఉన్న మహిళలు, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు, బీఆర్‌‌సీఏ జన్యువులో ఉత్పరివర్తనాలు ఉన్న వారికి ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి, 40 ఏళ్లు దాటిన వారు ఏడాదికి కనీసం ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సర్వైకల్ స్క్రీనింగ్

సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు వైద్యులు మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన సర్విక్స్‌లోని కణజాలం నమూనాను సేకరించి పరీక్షిస్తారు. ఈ కణజాలంలో హెచ్‌పీవీ టెస్టు చేస్తే హెచ్‌పీవీ వైరస్ ఉన్నదీలేనిదీ తేలుతుంది. ఈ వైరస్ భవిష్యత్తులో క్యాన్సర్‌కు దారి తీస్తుంది. సర్విక్స్ కణజాలంలో వచ్చే మార్పులను బట్టి కూడా భవిష్యత్తులో క్యా్న్సర్ వచ్చే అవకాశాలను వైద్యులు గుర్తిస్తారు.

Dietary supplements: ఆహారంలో పోషకాల కొరతా? ఇలా చేస్తే సరి.. ప్రముఖ న్యూట్రిషనిస్టు సలహా

కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్

వేగంగా వ్యాపించే కోలోరెక్టల్ క్యాన్సర్ తొలి దశల్లో ఎటువంటి రోగ లక్షణాలు కనిపించవు. కాబట్టి. 45 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీ పురుషులు క్రమం తప్పకుండా సిగ్మాయిడోస్కోపీ, కోలోనోస్కోపీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మరణించే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. పొగాకు, ధూమపానం ఉన్న వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. రోజుకు కనీసం 20 సిగరెట్లు తాగే వారు సంవత్సరానికి ఓసారి ఊపిరితిత్తుల స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి. పొగతాగే అలవాటు మానేసిన వారికీ ఈ పరీక్షలు తప్పనిసరి. ఇక 50 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వారు కూడా ఏడాదికోసారి లోడోస్ కంప్యూటెడ్ టెమోగ్రఫీ చేయించుకుంటూ ఉంటే క్యాన్సర్ నివారణ మెరుగ్గా ఉంటుంది.

40 ఏళ్ల పైబడిన వాళ్లల్లో ప్రొస్టేట్ క్యా్న్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, 40 ఏళ్లు పైబడ్డ పురుషులు క్రమం తప్పకుండా ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్ టెస్టు చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా పీఎస్ఏ ప్రొటీన్ ఎంత ఉందనేది చూస్తారు. దీని స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టైతే ప్రోస్టేట్ క్యా్న్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని అర్థం.ఇందుకు అనుగూణంగా వైద్యులు తదుపరి చికిత్స అందిస్తారు.

Read Latest and Health News

Updated Date - Dec 13 , 2024 | 06:24 PM