Protect your Hearing: మీ వినికిడి శక్తి కలకాలం నిలిచుండాలంటే ఇలా చేయండి!
ABN , Publish Date - Sep 23 , 2024 | 10:06 PM
కలకాలం వినికిడి శక్తి నిలిచి ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండటం, ఇయర్ బడ్స్ తక్కువగా వినియోగించడం వంటివి చేస్తే చెవులకు ఎటువంటి నష్టం రాదని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే (Health) వినికిడి శక్తి అవసరం. ఇది కోల్పోయినా, తగ్గినా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. డిప్రెషన్, ఆందోళన, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటివి జరుగుతాయి. సాధారణంగా మనుషులు 85 డెసీబెల్స్ వరకూ ధ్వని వినగలుగుతారు. అంతకుమించి శబ్ద తీవ్రత వినికిడి శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి, ఇది కలకాలం నిలిచుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు (Tried and test ways to protect hearing according to experts).
Tea-biscuit: ఉదయాన్నే టీ బిస్కెట్ తింటే రిస్క్ అని తెలుసా?
బయటకు వెళ్లినప్పుడు వెంట ఇయర్ ప్లగ్స్ తీసుకెళ్లాలి. శబ్దం భరించలేనిదిగా ఉన్నప్పుడు చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. దీంతో, వినికిడి శక్తిని కాపాడుకోవచ్చు.
జలుబు, ముక్కు దిబ్బడ వంటివి వేధిస్తున్నప్పుడు విమానప్రయాణాలు చేయకూడదు. విమానం ఎత్తుకు చేరినప్పుడు ముక్కులోని గాలి ఒత్తిడిలో మార్పులు వస్తాయి. ఇవి చెవుల్లోని ఒత్తిడిపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ సమస్య రాకుండా ఉండేందుకు ప్రయాణాలకు అనుకూలమైన ఇయర్ ప్లగ్స్ వాడాలి.
Viral: కుర్చిలో కూర్చునే పొట్టచుట్టూ కొవ్వు కరిగించుకోవచ్చు! ఎలాగంటే..
ఇయర్ బడ్స్ పెట్టుకుని పెద్ద శబ్దంతో పాటలు వినకూడదు. ఇయర్ బడ్స్ పెట్టుకున్నా గదిలోని ఇతర శబ్దాలు వినబడే స్థాయిలో పాటల శబ్దం ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కాటన్ బడ్స్‌తో చెవిని శుభ్రం చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు ప్రమాదవశాత్తూ చెవిలో బడ్స్ విరిగి అక్కడే ఉండిపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఫలితంగా వినికిడి శక్తి సన్నగిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశం కూడా ఉంది.
Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?
Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!