Share News

Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!

ABN , Publish Date - Oct 03 , 2024 | 12:12 PM

గురకతో నిద్ర చెడిపోతున్న వారు కొన్ని సూచనలు పాటిస్తే ఈ సమస్యను వదిలించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాగా నీరు తాగడం, పక్కకు తిరిగి పడుకోవడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం వంటి వాటితో రాత్రిళ్లు హాయిగా నిద్రపోవచ్చని భరోసా ఇస్తున్నారు.

Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!

ఇంటర్నెట్ డెస్క్: నిద్ర చెడిపోవడానికి అనేక కారణాల్లో గురక కూడా ఒకటి. ఇది అవతలి వారికి కూడా ఇబ్బందిగా మారుతుంది. గురకకు చిన్న చిన్న కారణాలతో పాటు స్లీప్ యాప్నియా అనే రుగ్మత కూడా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గురక నుంచి ఉపశమనం లభించి కంటినిండా నిద్ర పడుతుందని అంటున్నారు (Health).

గురకకు కారణం..

గొంతులో గాలి ప్రయాణించే మార్గం కుంచించుకుపోతే గురక వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గాలి వెళ్లే వాహికలు కుంచించుకుపోయిన సందర్భాల్లో వాటి చుట్టూ ఉండే కండరాలు గాలికి అడ్డం పడి ప్రకంపనలకు లోనవుతాయి. ఫలితంగా గురక వస్తుంది. ఇవి కుంచించుకుపోవడానికి పలు కారణాలు ఉన్నాయట.

Obesity: పురుషులకు అలర్ట్! ఊబకాయంతో టెస్టెస్టిరాన్ హార్మోన్‌ తగ్గుదల!


  • వయసు పెరిగే కొద్దీ గొంతులోని కండరాలు వదులై గురకకు దారి తీస్తాయి.

  • ఊబకాయం కారణంగా గొంతు చుట్టూ కొవ్వు పేరుకుని గాలి వెళ్లే వాహిక కుంచించుకుపోతుంది.

  • జలుబు, సైనస్ లేదా ఇతర కారణాల వల్ల ముక్కు మూసుకుపోయినప్పుడు నోటితో గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు కూడా గురక సమస్య వేధిస్తుంది.

  • ఎల్లకిలా పడుకున్నడ్డు నాలిక నోట్లో వెనకవైపు మడతపడుతుంది. గొంతు కూడా స్వల్పంగా కుంచించుకుపోతుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా గాలి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి చివరకు గురక మొదలవుతుంది.

  • స్లిప్ యాప్నియా అనే రుగ్మత ఉన్న వాళ్లు రాత్రిళ్లు నిద్రలో తమకు తెలీకుండా కొన్ని క్షణాల పాటు గాలి పీల్చుకోవడం ఆపేస్తారు. ఇది కూడా గురకకు దారి తీస్తుంది.

  • బీపీ, గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చిన వారిలో కూడా ఈ సమస్య ఉంటుంది.

  • రాత్రి కలత నిద్ర వల్ల కూడా గురక వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రెగ్నెంట్ మహిళలు కాఫీ తాగొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..


ఈ సూచనలతో గురకకు విముక్తి

  • గురక సమస్య వేధించకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే..

  • ఊబకాయం ఉన్న వాళ్లకు గురక సమస్య అధికం కాబట్టి. బరువును అదుపు తప్పకుండా చూసుకోవాలి. నిత్యం కసరత్తులు చేస్తూ, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి

  • వెల్లకిలా పడుకునే బదులు ఓ పక్కకు తిరిగి పడుకుంటే కూడా గురక బెడద తప్పుతుంది.

  • తలకింద ఎత్తుగా ఉండే దిండ్లు పెట్టుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. గురక తగ్గి మంచి నిద్ర పడుతుంది.

  • డీహైడ్రేషన్ కారణంగా కూడా గురక వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒంట్లో నీరు తగ్గినప్పుడు గొంతు, గాలి వాహికల గోడలకు ఉండే మ్యూకస్ గట్టిపడి గురక మరింత తీవ్రమవుతుందట. కాబట్టి, రాత్రి పడుకునే ముందు తగినంత నీరు తాగితే ఈ సమస్య తొలగిపోతుందని చెబుతున్నారు.

  • మద్యం కూడా గురకకు కారణమవుతుంది. దీని వల్ల గొంతు కండరాలు వదులై గురక మొదలవుతుండట.

  • ముక్కు మూసుకుపోయినప్పుడు తగు ఔషధాలు తీసుకుంటే గురక వేధించదని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest News

Updated Date - Oct 03 , 2024 | 12:21 PM