Sleep Jerks: నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కిపడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజరే
ABN , Publish Date - Mar 30 , 2024 | 06:08 PM
నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఉలిక్కిపడ్డారా(Sleep Jerks). సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా. ఈ వార్త చదవండి.. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది.
న్యూయార్క్: నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఉలిక్కిపడ్డారా(Sleep Jerks). సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా. ఈ వార్త చదవండి.. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది.
ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి అసోసియేట్ డైరెక్టర్, న్యూరాలజీ అండ్ హెడ్ న్యూరో ఇంటర్వెన్షన్‌గా పని చేస్తున్న డా.వినిత్ బంగా ఈ విషయంపై మాట్లాడారు. వినిత్ తెలిపిన వివరాల ప్రకారం.. స్లీప్ జెర్క్‌లలో అత్యంత సాధారణ రకాల్లో ఒకటి హిప్నిక్ జెర్క్. నిద్రలోకి జారుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఎవరో పట్టి లాగినట్టు, పెద్ద లోయలోకి పడిపోతున్నట్లు అనిపించే భావనే హిప్నిక్ జెర్క్. ప్రపంచంలో 70 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వివిధ ఫ్రీక్వెన్సీ, తీవ్రతతో హిప్నిక్ జెర్క్‌లను ఎదుర్కుంటారని అంచనా.
స్లీప్ జర్క్స్ కారణాలు..
స్లీప్ జర్క్స్ రావడానికి కచ్చితమైన కారణాలైతే ఇంకా తెలియరాలేదు. వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఈ జర్క్‌లు రావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. రోజంతా పని చేసిన మెదడు.. విశ్రాంతి కోరుకుంటుంది. అలాంటి సమయంలో కండరాల స్థాయి, సడలింపులలో మార్పులు జరుగుతాయి.
Lok Sabha Elections: జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
తద్వారా నిద్ర పోతున్న సమయంలో జర్కింగ్ రావచ్చు. దానికితోడు ఒత్తిడి, కెఫిన్ వినియోగం, సమయానికి నిద్ర పోకపోవడం వంటి అనేక అంశాలు నిద్ర కుదుపులకు కారణమవుతాయి.
చికిత్స..
స్లీప్ జెర్క్‌లకు వైద్య చికిత్స అవసరం లేనప్పటికీ, అవి ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగించవచ్చు. కొంతమంది వ్యక్తులకు అసౌకర్యం లేదా ఆందోళన కలిగించవచ్చు. స్లీప్ జెర్క్స్ తరచుగా వస్తే నిద్రలేమి లేదా రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటివి సంభవిస్తాయి. అలాంటప్పుడు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది.
తగ్గించుకునే మార్గాలు..
తరచూ స్లీప్ జెర్క్స్ వస్తుంటే వాటి తీవ్రతను తగ్గించడానికి కొన్ని టిప్స్ అనుసరించాలి. సమయానికి నిద్ర పోవాలి, నిద్రపోయే గంట ముందు వరకు కెఫీన్, నికోటిన్ వంటివాటికి దూరంగా ఉండాలి. రోజూ వయసుకు తగినట్లు కంటికి తగ్గ నిద్ర అవసరం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని.. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి