Share News

Milk: ఉదయం.. రాత్రి.. పాలు తాగేందుకు సరైన సమయం ఏదంటే..

ABN , Publish Date - Sep 07 , 2024 | 11:19 AM

పాలు రాత్రి వేళ తాగితే మంచిదా లేక ఉదయం పూటనా అనేది వ్యక్తుల శరీర తత్వాన్ని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట పాలు తాగితే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారని, రాత్రి పాలు తాగితే కంటి నిండా కునుకు పడుతుందని చెబుతున్నారు.

Milk: ఉదయం.. రాత్రి.. పాలు తాగేందుకు సరైన సమయం ఏదంటే..

ఇంటర్నెట్ డెస్క్: పాలల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. కండరాల పటుత్వానికి, పళ్లు, ఎముకలు దృఢత్వానికి, బరువు నియంత్రణకు పాలు తాగడం ఎంతో అవసరం. పాలతో రోగ నిరోధక శక్తి కూడా బలోపేతమవుతుంది (Health). ఒంట్లో నీటి శాతం పెరిగి జీవక్రియలు వేగవంతమవుతాయి.

అయితే, ఇన్ని లాభాలు ఉన్న పాలను ఉదయం తాగితే మంచిదా లేదా రాత్రిళ్లు పడుకునే ముందు తాగితే మంచిదా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి వైద్యులు సవివరమైన సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తుల శరీర తత్వం, అభిరుచి, ఆశిస్తున్న ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పాలు తాగే సమయాన్ని బట్టి వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు (what is the best time to drink milk ).

Side effects of Turmeric: అలర్ట్.. పసుపుతో ఇలాంటి ప్రమాదం ఉందని తెలుసా?


ఉదయం పూట పాలు తాగితే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, ఫ్యాట్స్ వంటివి శరీరానికి సమృద్ధిగా అంది రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పాలు తాగితే కడుపు నిండినట్టు అనిపిస్తుంది కాబట్టి తిండి కూడా తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే పాలు తాగితే కాల్షియం, విటమిన్ డీ, బీ వంటివి రోజు ప్రారంభంలోనే శరీరానికి లభించి ఉత్సాహం ఇనుమడిస్తుంది.

అయితే, రాత్రి వేళ పాలు తాగితే చక్కటి నిద్ర పడుతుంది. పాలల్లోని ట్రిఫ్టోఫాన్ అనే అమైనో యాసిడ్ యే ఇందుకు కారణం. ఇది మంచి నిద్ర కలగజేస్తుంది. పాలల్లోని కాల్షియం.. ట్రిప్టోఫాన్ సెరెటోనిన్‌గా మారడంలో తోడ్పాటునందిస్తుంది. సెరెటోనిన్‌‌తో ప్రశాంతత లభించి కంటినిండా నిద్ర పడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్లతో రాత్రిళ్లు కండరాలు కోలుకుంటాయి. ఎక్సర్‌సైజులు చేసేవారు రాత్రిళ్లు పాలు తాగితే ఎంతో మేలు కలుగుతుంది.


‘‘ఏ టైంలో పాలు తాగితే మంచిదనేది వారి వారి శరీరతత్వాలపై ఆధారపడి ఉంటుంది. రోజంతా శరీరంలో శక్తి నిలిచి ఉండాలని కోరుకుంటే ఉదయం పూటే పాలు తాగాలి. కానీ రాత్రిళ్లు కంటినిండా నిద్ర పట్టాలంటే ఆ సమయంలో పాలు తాగడమే మేలు’’ అని న్యూట్రిషనిస్టు, హోలిస్టిక్ వెల్‌నెస్ కోచ్ ఇషాంకా తెలిపారు.

అయితే, పాలతో కొందరిలో ఇన్‌ఫ్లమేషన్ కూడా కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో, రాత్రిళ్లు కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, వ్యక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Health and Telugu News

Updated Date - Sep 07 , 2024 | 11:27 AM