Share News

Whiteheads: ముఖం మీద తెల్ల మచ్చలున్నాయా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి!

ABN , Publish Date - Feb 24 , 2024 | 06:11 PM

అసలు తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Whiteheads: ముఖం మీద తెల్ల మచ్చలున్నాయా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి!

చాలామంది ముఖం మీద వచ్చే నల్ల మచ్చలు తగ్గించుకునే చిట్కాల గురించి చెబుతూనే ఉంటారు. అధికశాతం మందికి నల్లమచ్చల సమస్యలే ఎక్కువ ఉంటాయి కూడా. అయితే కొందరికి తెల్ల మచ్చలు ఉంటాయి. వీటి వల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంది. వీటిని వదించుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈ తెల్ల మచ్చలను ఓ సింపుల్ చిట్కాతో తగ్గించేసుకోవచ్చు. అసలు ఈ తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి? వీటిని తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలి? తెలుసుకుంటే..

వైట్ హెడ్స్ ఎందుకొస్తాయి..

వైట్‌హెడ్ మొటిమల కారణంగా మిగిలే రూపం. ఇవి బ్యాక్టీరియా, ఆయిల్స్ , మృతకణాలు చర్మ రంధ్రాలలో చేరినప్పుడు వస్తాయి. వైట్‌హెడ్స్ కు గల కారణాన్ని అర్థం చేసుకుంటే వీటిని వదిలించుకోవడం సులువు. వైట్ హెడ్స్ ఎక్కువగా చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల వస్తాయి. వివిధ కారణాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుని పోతాయి. వీటిలో ఒక ప్రధాన కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు. ఇది మొటిమలు రావడం ద్వారా చర్మ రంధ్రాలు మూసుకుపోవడానికి కారణం అవుతుంది. చర్మ రంద్రాలు ఎక్కువ సెబమ్ లేదా ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారణంగానే వైట్ హెడ్స్ వస్తాయి.

ఇది కూడా చదవండి: టాయిలెట్ లోకి మొబైల్ తీసుకెళ్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!


వైట్ హెడ్స్ తగ్గించడానికి మాస్క్..

వైట్ హెడ్స్ తగ్గించడానికి తేనె, దాల్చిన చెక్క మాస్క్ బాగా సహాయపడుతుంది. తేనెలో సహజ ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడుతాయి. మంటను తగ్గిస్తాయి. అడ్డుపడే రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తాయి. దాల్చిన చెక్కలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మురికి, నూనె, మలినాలను బయటకు తీయడానికి, చర్మం ఫోలికల్స్‌లోకి లోతుగా ప్రవేశిస్తాయి. రెగ్యులర్ గా వాడటం వల్ల మాస్క్ రంధ్రాలను అన్‌క్లాగ్ చేస్తుంది, వైట్‌హెడ్స్ తొలగిస్తుంది, అదనపు సెబమ్ ఉత్పత్తిని నియంత్రించి తరువాత మచ్చలు రాకుండా చేస్తుంది.

మాస్క్ తయారీ..

అరటేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, స్పూను తేనెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేసుకుని 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

ఈ మాస్క్ ను కళ్ల కింద, కళ్లకు తగిలేలాగా వేసుకోకూడదు. మరొక విషయం ఏమిటంటే దాల్చిన చెక్క చర్మానికి కాస్త మంట కలిగిస్తుంది. ఇది ముఖచర్మంలోపలి మురికిని, మలినాలను బయటకు తీస్తుంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

10-15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2-3 సార్లు వేస్తుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

ఫేస్ వేసుకోవడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం వల్ల దీనివల్ల కలిగే దుష్ర్పభావాలను అరికట్టవచ్చు.

ఇది కూడా చదవండి: జీవితాన్ని అందంగా మార్చే 8 అలవాట్లు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 06:11 PM