Winter - Asthma: చలికాలంలో ఆస్తమాతో ఇబ్బందులు.. ఇలా చేస్తే ఉపశమనం!
ABN , Publish Date - Dec 15 , 2024 | 11:01 PM
ఆస్తమా ఉన్న వారు చలికాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్తమా ఉన్న వారికి చలికాలం ఇబ్బందికరంగా మారుతుంది. చల్లిని, తేమ తక్కువగా ఉన్న గాలికి తోడు వాతావరణంలో అకస్మాత్ మార్పులు శ్వాసకోశాన్ని చికాకు పెడతాయి. ఫలితంగా శ్వాసనాళాల్లో మ్యూకస్ ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇది అనేక ఇబ్బందులు కలగజేస్తుంది. అలా అని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా రకరకాల అలర్జీలు బారినపడి మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. కాబట్టి స్థూలంగా చూస్తే చలికాలం ఆస్తమా రోగులకు ఇబ్బందికరమని చెప్పకతప్పదు (Health)
Health: ఆరోగ్యవంతుల్లోనూ కార్డియాక్ అరెస్టు! కారణాలు ఇవే..
వైద్యులు చెప్పేదాని ప్రకారం, చల్లనిగాలి కారణంగా శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఆస్తమా ఉన్న వారికి ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు వేధిస్తాయి. ఇక తలుపులన్నీ మూసుకుని ఇంట్లో ఉండిపోతే దుమ్ముధూళీలాంటి ఎలర్జీకారకాలకు బయటకు వెళ్లే మార్గం ఉండదు. ఇవి చివరకు ఉపిరితిత్తులో చేరి ఆస్తమాను మరింత ముదిరేలా చేస్తాయి.
చలికాలంలో సాధారణంగా వచ్చే ఫ్లూ, జలుబు వంటివి కూడా ఆస్తమా రోగులకు మరింత నరకం చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటి వల్ల అకస్మాత్తుగా ఆస్తమా తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. చలికాలంలో అస్తమా సడెన్‌గా పెరగడానికి ఇవి ప్రధానకారణాలని అంటున్నారు.
Cancer Screening test: క్యాన్సర్ ముప్పు! తప్పనిసరిగా చేయించుకోవాల్సిన 5 స్క్రీనింగ్ టెస్టులు
కాబట్టి చలికాలంలో ఆస్తమా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నీరు బాగా తాగాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి సమీపానికి ఆస్తమా రోగులు అస్సలు వెళ్లకూడదు. ఇక శాసకోస సమస్యల అవకాశాలు తగ్గించుకునేందుకు పరిశుభ్రత పాటించాలి. సందర్భాన్ని బట్టి చేతులను కడుక్కుంటూ ఉండాలి. చలికాలంలో నోటితో కాకుండా ముక్కుతో గాలి పీలిస్తే కొంత వరకూ ఆస్తమాను అరికట్టొచ్చు. ముక్కు గుండా వేళ్లే సమయాల్లో గాలి వేడెక్కుతుంది. ఫలితంగా శాస్వనాళాలపై చలి ప్రభావం తగ్గుతుంది.
ఇక ఆస్తమా రోగులు కచ్చితంగా ఫ్లూ టీకా తీసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. వెంట తప్పనిసరిగా ఇన్‌హేలర్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఇల్లును వ్యాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రపరచడం, దుమ్మూధూళీలేకుండా చూసుకోవడం చేయాలి. అంతేకాకుండా, ఆస్తమా మెడికేషన్లు నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు.
Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!