Share News

Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..

ABN , Publish Date - Nov 08 , 2024 | 07:50 PM

బీర్ తాగే అలవాటు ఉన్న వాళ్లు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటును వెంటనే కట్టిపెట్టాలని సూచిస్తున్నారు.

Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..

ఇంటర్నెట్ డెస్క్: బీర్ తాగితే ఎంతటి అలసట కూడా చిటికెలో మాయమై రిలాక్స్ అయిపోతామని కొందరు అంటారు. నలుగురు ఫ్రెండ్స్ ఒకచోట కలిస్తే మందు పార్టీ, బీర్ తప్పదని సాకులు చెబుతుంటారు. కానీ బీర్ తాగే అలవాటున్న వారు వెంటనే దాన్ని మానేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని స్పష్టం చేస్తున్నారు (Health). రెగ్యులర్‌గా బీర్ తాగితే కలిగే ప్రమాదాలు ఏవంటే..

బీర్ తాగే వారిలో మెదడు సామర్థ్యం, జ్ఞాపశక్తి తగ్గుతాయి. బీర్‌లోని ఆల్కహాల్ న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుకు అడ్డంకిగా మారడమే ఇందుకు కారణం. బీర్ మానేస్తే నాడీ కణాలు పూర్వపు సామర్థ్యాలను తిరిగిపొందుతాయి. మెదడు సామర్థ్యం పెరుగుతుంది. పరిస్థితులకు వేగంగా స్పందించగలుగుతారు

Viral: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టే

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఆల్కహాల్ డిప్రెషన్ కలగజేస్తుంది. సహజసిద్ధ భావోద్వేగ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. సెరటోనిన్, డోపమైన్‌ మధ్య నియంత్రణను పట్టాలు తప్పేలా చేస్తుంది. చివరకు భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. బీర్ మానేస్తే శరీరం సులువుగా పూర్వస్థితికి చేరుకుంటుంది

బీర్‌లోని ఆల్కహాల్ కారణంగా మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దీంతో, మెదడు కణాలు దెబ్బతింటాయి. ఇది మెదడు సామర్థ్యం శాశ్వతంగా తగ్గేలా చేస్తుంది. ఫలితంగా ఆల్జైమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల బారిన పడతారు. ఈ సమస్యల నుంచి తప్పించుకునేందుకు బీర్ తాగకపోవడమే తరుణోపాయం

Kapalabhati: కపాలభాతి ప్రాణాయామంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?


తార్కిక శక్తికి, క్షణికావేశాలపై నియంత్రణకు మెదడులోని ప్రీఫ్రాంటల్ భాగం కీలకం. ఆల్కహాల్ కారణంగా ఈ భాగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గుతుంది. క్షిణావేశాలు పెరిగి ఊహించని సమస్యలకు దారితీస్తాయి. అయితే, బీర్ మానేయగానే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మళ్లీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఆల్కహాల్‌తో రిలాక్స్ అయిన భావన కలిగినప్పటికీ దీంతో నిద్రకు దూరమవుతారు. ముఖ్యంగా నిద్రకు సంబంధించి రెమ్ స్లీప్ స్థితిని ఆల్కహాల్ అమితంగా ప్రభావితం చేస్తుంది. దీంతో, మరుసటి రోజు అలసట, చికాకు పెరుగుతాయి.

తరచూ బీర్ తాగే వారిలో లివర్, గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అలవాటు మానేస్తే కాలేయంపై ఒత్తిడి తగ్గి క్రమంగా కోలుకుంటుంది. సిర్రోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. బీపీ నియంత్రణలో ఉండి గుండె కూడా సక్రమంగా పనిచేస్తుంది.

Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!


ఆల్కహాల్ కారణంగా డీహైడ్రేషన్ బారినపడతారు. ఫలితంగా చర్మం పొడిబారి కాంతి, నిగారింపు కోల్పోతుంది. ముఖం కూడా ఉబ్బినట్టుగా మారుతుంది. చివరకు అకాల వృద్ధాప్యం వచ్చి పడుతుంది.

ఆల్కహాల్‌తో రోగ నిరోధక శక్తి కూడా బలహీనమై రోగాలు చుట్టుముట్టే ప్రమాదాలు పెరుగుతాయి. బీర్ తాగడం మానేస్తే రోగనిరోధక శక్తి పూర్వస్థితిని సంతరించుకుని ఇన్ఫెక్షన్ల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.

Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..

Read Latest and Health News

Updated Date - Nov 08 , 2024 | 07:55 PM