Share News

Health: ఆఫీసులో పని ఒత్తిడి.. ఏడాదిలో 20 కిలోల బరువు పెరిగిన మహిళ!

ABN , Publish Date - Sep 15 , 2024 | 06:58 PM

పని ఒత్తిడితో ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చైనాలో ఓ మహిళపై పని ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపింది. ఏడాదిలో ఆమె ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన వైనం స్థానికంగా కలకలానికి దారి తీసింది.

Health: ఆఫీసులో పని ఒత్తిడి.. ఏడాదిలో 20 కిలోల బరువు పెరిగిన మహిళ!

ఇంటర్నెట్ డెస్క్: వృత్తిజీవితంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చైనాలో ఓ మహిళపై పని ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపింది. ఏడాదిలో ఆమె ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన వైనం స్థానికంగా కలకలానికి దారి తీసింది. ‘‘పనిలో స్ట్రెస్.. నా శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది’’ అని ఆమె స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది (Health).

Cold Showers: ఉదయాన్నే చన్నీటి స్నానంతో లాభమా? నష్టమా?

సుదీర్ఘ పనిగంటలకు తోడు తీవ్ర ఒత్తిడితో ఉద్యోగుల్లో ఊబకాయం రావడాన్ని ఓవర్ వర్క్ ఒబెసిటీ అంటారు. నేటి జమానాలో అనేక మంది దీని బారిన పడుతున్నారు. నిత్యం పనిలో బిజీగా గడిపేవారు కొన్ని సార్లు ఓ పూట తిండి మానేస్తారు. అనారోగ్యకర ఫాస్ట్ ఫుడ్ తిని కడుపు నింపుకుంటారు. స్ట్రెస్ కారణంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చివరకు పనిలో పడి తమకు తెలీకుండానే అతిగా తీని ఊబకాయులుగా మారతారు.

Health: తీరిక లేదని తరచూ తిండి మానేస్తే జరిగేది ఇదే.. జాగ్రత్త!


ఇలాంటి వారు బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు వైద్యులు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని సూచనలు చేస్తున్నారు (How to overcome obesity).

  • పళ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్, పప్పు దినుసులు ఉన్న సమతుల ఆహారం తినాలి.

  • రోజూ కనీసం 45 నిమిషాలు కసరత్తు చేయాలి. ఏ ఒక్క రోజు కూడా ఎక్సర్‌సైజులను నిర్లక్ష్యం చేయకూడదు.

  • దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికి చేటు చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడూ మనసుకు రిలాక్సేషన్ కలిగించే పనులు చేస్తూ సేద తీరాలి.

Viral: 9 వేల కిలోమీటర్ల దూరాన ఆపరేషన్ థియేటర్.. రిమోట్ కంట్రోలర్‌తో సర్జరీ!


  • హార్మోన్ల సమతౌల్యానికి కంటినిండా నిద్ర అవసరం. కాబట్టి రాత్రిళ్లు ఏడు ఎనిమిది గంటలు నిద్రపోయేందుకు ప్రయత్నించాలి.

  • ఊబకాయం నియంత్రణకు వైద్యుల సాయం కూడా తీసుకోవాలి. ఔషధాలను క్రమం తప్పకుండా వాడాలి.

  • అనారోగ్యాలు ముదరకుండా ముందుగానే పసిగట్టేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. దీంతో, బరువు అదుపులో ఉండి కలకాలం ఆరోగ్యంతో కళకళలాడుతారు.

Read Health and Latest News

Updated Date - Sep 15 , 2024 | 07:04 PM