ఇరాన్లో పోలీసు కాన్వాయ్‌పై దాడి
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:13 AM
ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బలూచ్ ప్రావిన్స్‌లో పోలీసుల కాన్వాయ్‌పై శనివారం జరిగిన దాడిలో 10 మంది అధికారులు మృతి చెందారు.
10 మంది అధికారుల మృతి
దుబాయి, అక్టోబరు 26 : ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బలూచ్ ప్రావిన్స్‌లో పోలీసుల కాన్వాయ్‌పై శనివారం జరిగిన దాడిలో 10 మంది అధికారులు మృతి చెందారు. ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 1,200 కిలోమీటర్ల దూరంలోని గోహర్ కు ప్రాంతంలో ఈ దాడి జరిగింది. రెండు భద్రతా సిబ్బంది వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరగడంతో వాటిలోని వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడి చేసిందెవరో తెలియలేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారం తెల్లవారు జాము నుంచి దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.