Share News

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

ABN , Publish Date - Dec 22 , 2024 | 02:39 PM

దక్షిణాఫ్రికాలోని కాంగోలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి.. 38 మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

కాంగో, డిసెంబర్ 22: దక్షిణాఫ్రికాలోని ఈశాన్య కాంగోలో బుసిరా నదిలో పడవ (ఫెర్రీ) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. మరో 100 మంది గల్లంతయ్యారు. వారిలో 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయని ఇంజెండీ నగర మేయర్ జోసఫ్ వెల్లడించారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ఈ పడవ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.

Also Read: భారీగా డ్రగ్స్ స్వాధీనం

Also Read: చుక్కకూరతో ఇన్ని లాభాలు ఉన్నాయా..?

క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు వీరంతా స్వస్థలాలకు వస్తున్నారని వివరించారు. నాలుగు రోజుల క్రితం ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడి.. 25 మంది గల్లంతయ్యారని గుర్తు చేశారు. రోజుల వ్యవధిలోనే ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజెండీ, లూలో పోర్టుల నుంచి దాదాపు 400 మంది ప్రయాణికులు ఈ పడవ ఎక్కారని స్థానికులు వెల్లడించారు.

Also Read: రాహుల్ గాంధీకి మళ్లీ కోర్టు సమన్లు

Also Read: రాగుల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

మరోవైపు వరుస పడవ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో.. కాంగో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పరిమితికి మించి ప్రయాణికులను పడవల్లో ఎక్కించుకొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మారుమూల ప్రాంతాల ప్రజలు బస్సుల్లో అధిక ఛార్జీలను భరించలేక.. జల రవాణా చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను తరలించే క్రమంలో సురక్షిత చర్యలను తీసుకోవాలంటూ పడవ యాజమానులకు ప్రభుత్వం సూచించింది.

Also Read: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి


ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రయాణికులకు తీసుకు వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 78 మంది నీట మునిగి మరణించారు. అలాగే ఈ ఏడాది జూన్‌లో పడవ బోల్తా పడిన ఘటనలో 80 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇక ఈ ప్రస్తుత పడవ ప్రమాదంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పడవలకు ఫ్లోటేషన్ పరికరాలు అమర్చక పోవడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. పడవలో ప్రయాణించే వారు.. తమతో బాటు తెచ్చుకొనే భారీ లగేజీ సైతం ఈ ప్రమాదానికి కారణమవుతోందని అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు

Also Read: జర్మనీలో దాడి.. పలువురి మృతి, ఏడుగురు భారతీయులకు గాయాలు


ఇంకోవైపు.. కాంగో భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల్లో ప్రజలు ప్రయాణించేందుకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు పడవ ప్రయాణాలను ఎంచుకొంటున్నారని సమాచారం. ఆ క్రమంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఈ తరహా ప్రమాదాల్లో వందలాది మంది మరణించడంతోపాటు గల్లంతయ్యారు.

For International News And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 02:47 PM