US Electiuons:ఫలించిన ట్రంప్ మ్యాజిక్.. రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించనున్న స్టేబుల్ జీనియస్
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:00 PM
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు అందుతున్న లెక్కల ప్రకారం రిపబ్లిన్ పార్టీ మెజార్టీ మార్క్‌కు అవసరమైన ఎలక్టోరల్ ఓట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దీంతో అమెరికా తదుపరి అధ్యక్షునిగా..
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ సత్తా చాటింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు అందుతున్న లెక్కల ప్రకారం రిపబ్లిన్ పార్టీ మెజార్టీ మార్క్‌కు అవసరమైన ఎలక్టోరల్ ఓట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దీంతో అమెరికా తదుపరి అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే కానుంది. డెమోక్రటిక్ అభ్యర్థి కమల హారీస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఓట్లు సాధించాలి. దాదాపు 280 ఓట్లకు పైగా ఆధిక్యాన్ని రిపబ్లికన్ పార్టీ కనబరుస్తోంది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు ఎంతో ఉత్కంఠను, ఆసక్తిని రేపాయి. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేశారు. 2021 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడంతో జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష పదవి పోయిన తర్వాత ట్రంప్ ఎన్నో ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేసి మరీ గెలిచారు.
నెరవేరని కమల హారీస్ ఆశలు
ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని కమలా హారిస్ భావించారు. విజయంపై పూర్తి ధీమాతో ఉన్న ఆమె ముందుగానే స్పీచ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ట్రంప్ లీడ్‌లో దూసుకెళుతుండటంతో స్పీచ్‌ను రద్దు చేసుకున్నారు. కమలా హ్యారిస్ గెలుస్తుందనే నమ్మకంతో ముందుగానే వాష్టింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీకి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె ఓడిపోవడంతో కన్నీళ్లతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
సెన్సేషనల్ ట్విట్..
డొనాల్డ్ ట్రంప్ లీడ్‌లో దూసుకెళ్తుండగా, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో స్పందించారు. "మార్పు కోసం స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు.. ఈ రాత్రి అమెరికన్ ప్రజలు రియల్ ట్రంప్‌ను చూస్తారు.." అని ఎలోన్ మస్క్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. అంతకుముందే "గేమ్, సెట్ అండ్ మ్యాచ్" అని పోస్ట్ చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో టెన్నిస్ మ్యాచ్‌లో ఓ ఆటగాడు గెలిచాడని చెప్పడానికి ఎక్కువగా ఈ పదాలు వాడుతుంటారు.
కాగా, ఎన్నికల్లో మస్క్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ఫిలడెల్ఫియా ప్రాంతంలో ట్రంప్ కు మద్దతుగా అక్టోబర్ 17న తన తొలి వ్యక్తిగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రంప్ పాలనలో చోటుచేసుకున్న ముఖ్యమైన అంశాలను, రాజకీయ పరిస్థితులను, తాను ఎందుకు ట్రంప్ కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో తన అభిప్రాయాలను ఆ కార్యక్రమంలో వివరించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here