Share News

US Election Results: అమెరికా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే 7 స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలు ఇవే

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:26 AM

అమెరికా ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తున్నాయని భావిస్తున్న స్వింగ్ రాష్ట్రాలను ‘రణక్షేత్ర రాష్ట్రాలు’గా అక్కడి రాజకీయ విశ్లేషణకులు అభివర్ణిస్తున్నారు. అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఈ రాష్ట్రాల్లో గెలుపు ముఖ్యమని అంటున్నారు. ఈ రాష్ట్రాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో ముందే ఊహించడం సంక్లిష్టంగా ఉంటుంది. ఈసారి ఫలితం ఎలా ఉందంటే..

US Election Results: అమెరికా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే 7 స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలు ఇవే
Trump Kamala Harris

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను డిసైడ్ చేయడంలో 7 స్వింగ్ రాష్ట్రాలు అత్యంత కీలకమని అక్కడి రాజకీయ నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. విజయం ఎవరివైపు ఉంటుందో పసిగట్టలేని ఈ రాష్ట్రాల ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఏడు స్వింగ్ స్టేట్స్ ఉండగా ఏకంగా 6 రాష్ట్రాల్లో ఆయన హవా కొనసాగుతోంది. అమెరికా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలై ఇప్పటికి 4 గంటల సమయం గడిచింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఆధిక్యంపై క్లారిటీ వచ్చింది.

డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. నార్త్ కరోలినా రాష్ట్రం ట్రంప్‌కు చాలా అనుకూలంగా ఉంది. ఆరిజోనా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియాల్లో కూడా ఫలితాలు ఆయనకు అనుకూలంగా వెలువడుతున్నాయి. ఇక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన నెవాడాలో లీడ్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఈ రాష్ట్రాల్లో ట్రంప్‌ ముందంజలో ఉంటారని ఎగ్జిట్ పోల్స్ ముందుగానే అంచనా వేసిన విషయం తెలిసిందే.


రణక్షేత్ర రాష్ట్రాలు..

అమెరికా ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తున్నాయని భావిస్తున్న స్వింగ్ రాష్ట్రాలను ‘రణక్షేత్ర రాష్ట్రాలు’గా అక్కడి రాజకీయ విశ్లేషణకులు అభివర్ణిస్తున్నారు. అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఈ రాష్ట్రాల్లో గెలుపు ముఖ్యమని అంటున్నారు. ఈ రాష్ట్రాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో ముందే ఊహించడం సంక్లిష్టంగా ఉంటుంది. డెమోక్రాట్, రిపబ్లికన్‌లకు దాదాపు సమాన స్థాయి మద్దతు ఉంటుంది. అందుకే ఎవరు గెలుస్తారనేది ఫలితాలు వచ్చేవరకు చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. అత్యధికంగా పెన్సిల్వేనియా 19 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. మిచిగాన్‌లో 10, జార్జియాలో 16, విస్కాన్సిన్‌లో 10, నార్త్ కరోలినాలో 16, నెవాడాలో 6, అరిజోనాలో 11 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి.


ఎవరు గెలిచినా మెజారిటీలు స్వల్పమే..

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించి రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. 1980 నుంచి రిపబ్లికన్ పార్టీ గెలుచుకుంటున్న రాష్ట్రాలను ‘రెడ్ స్టేట్స్’గా, 1992 నుంచి డెమోక్రాటిక్ పార్టీ హవా కొనసాగుతున్న రాష్ట్రాలను ‘బ్లూ స్టేట్స్’గా అభివర్ణిస్తున్నారు. ఈ రెండు కేటగిరీలలోనూ ఫలితాలను అంచనా వేయవచ్చు. కానీ ఫలితాలను ముందుగానే అంచనా వేయలేని 7 రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలుగా పేర్కొంటారు. ఈ రాష్ట్రాల్లో స్వల్ప మెజారిటీతో విజయాలు నమోదవుతుంటాయి. ఉదాహరణగా అరిజోనాను తీసుకుంటే.. గత అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కేవలం 10,000 ఓట్ల తేడాతో ఇక్కడ విజయం సాధించారు. మిగతా రాష్ట్రాల్లో కూడా మార్జిన్ అంత పెద్దగా లేదు.


ఇవి కూడా చదవండి

అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు

అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ మొదలు.. లీడ్‌లో ఎవరు ఉన్నారంటే

దేశీయ మార్కెట్లపై అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం

ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే

For more International News and Telugu News

Updated Date - Nov 06 , 2024 | 11:28 AM