స్పెయిన్ రాజుపై బురద విసిరిన వరద బాధితులు
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:08 AM
వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయినా ప్రభుత్వం సకాలంలో సాయం చేయలేదంటూ స్పెయిన్ దేశం రాజు ఫెలిపే-4పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెలెన్సియా, నవంబరు 3: వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయినా ప్రభుత్వం సకాలంలో సాయం చేయలేదంటూ స్పెయిన్ దేశం రాజు ఫెలిపే-4పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై బురద చల్లి, కేకలు వేసి నిరసన తెలిపారు. గురువారం వచ్చిన వరదల కారణంగా 200మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద తీవ్రత అధికంగా ఉన్న వెలెన్సియా నగరం శివారు అయిన పైపోర్టాలో కనీసం 60 మంది మరణించారు. వరదబాధితులను పరామర్శించేందుకు తొలిసారిగా ఆదివారం ఆయన పైపోర్టాకు రాణి లెటిజియాతో కలిసి వచ్చారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేయగా తమకు సాయం అందలేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బురద విసరగా అది ఆయన ధరించిన నల్లని రెయిన్ కోటుపై పడింది. అయితే, రాజు ఫెలిపే మాత్రం సంయమనం కోల్పోకుండా వారిని అనునయించారు. ఒక బాధితుడు ఆయన బుజంపై వాలి కన్నీరు పెట్టుకున్నాడు.