Share News

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లోని విద్యాసంస్థలకు భారత ఎంబసీ లేఖ.. వారిని తిరిగి పంపాలని సూచన

ABN , Publish Date - May 19 , 2024 | 09:28 PM

కిర్గిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులపై రెండు రోజులుగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కి చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు. దాడులు తీవ్రమవుతున్న వేళ భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది. తాజాగా కిర్గిస్థాన్‌లోని యూనివర్సిటీలు, కళాశాలలకు భారత ఎంబసీ లేఖ రాసింది.

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లోని విద్యాసంస్థలకు భారత ఎంబసీ లేఖ.. వారిని తిరిగి పంపాలని సూచన

ఢిల్లీ: కిర్గిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులపై రెండు రోజులుగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కి చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు. దాడులు తీవ్రమవుతున్న వేళ భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది. తాజాగా కిర్గిస్థాన్‌లోని యూనివర్సిటీలు, కళాశాలలకు భారత ఎంబసీ లేఖ రాసింది.


స్థానికుల దాడుల్లో భారత విద్యార్థులు గాయపడినట్లు తెలిసిందని లేఖలో పేర్కొంది. "అన్ని విద్యాసంస్థలు విద్యార్థులను భారత్‌కు పంపి, ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలి. దాడుల నేపథ్యంలో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారు. కొందరు విద్యార్థులు ఈ దాడుల్లో గాయపడ్డారు. ఈ సమయంలో ఒంటరిగా విదేశీ గడ్డపై ఉండి ఒత్తిడిని తట్టుకోలేరు.

విద్యార్థులు తమ తరగతులకు హాజరుకాలేరు. వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చేందుకు అనుమతించండి. కొన్నాళ్ల పాటు ఆన్‌లైన్ విధానంలో విద్యాభ్యాసం కొనసాగించండి. విద్యాసంస్థల యాజమాన్యాలు మా సూచనను పరిగణలోకి తీసుకుంటాయని ఆశిస్తున్నాం" అని ఎంబసీ తన లేఖలో పేర్కొంది.


నగరమంతటా అల్లర్లు..

కిర్గిస్థాన్ రాజధాని బిష్కేశ్‌‌లోస్థానిక ప్రజలు విదేశీ విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారు. హింసాత్మక గుంపు నగరం అంతటా అల్లర్లు సృష్టిస్తోంది. విదేశీ విద్యార్థులపై దాడులు చేస్తోంది. ఈ ఘటనల్లో పాకిస్థానీ విద్యార్థులు అత్యధికంగా గాయపడ్డారు. దీంతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. భారత్, పాకిస్తాన్ సహా పలు దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు మెడిసిన్ చదవడానికి కిర్గిస్థాన్‌కు వెళ్తుంటారు.

రాజధాని బిష్కేశ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు నివసిస్తున్నారు. ఇటీవల కొందరు ఈజిప్టు విద్యార్థులు అక్కడ దోపిడీ చేస్తున్న స్థానిక దొంగలతో క‌ల‌సి దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ విద్యార్థులే టార్గెట్‌గా వారి దాడులు కొనసాగుతున్నాయి. కిర్గిస్థాన్ లో సుమారు 15 వేల మంది బార‌తీయ‌ విద్యార్థులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Read Latest National News and Telugu News

Updated Date - May 19 , 2024 | 09:28 PM