Share News

Iraq : కొత్త చట్టం అమలయితే.. 9 ఏళ్లకే పెళ్లి

ABN , Publish Date - Aug 09 , 2024 | 02:29 PM

దేశంలో యువతల వివాహ కనీస వయస్సు 9 ఏళ్లుగా నిర్ణయించేందుకు ఇరాక్ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తుంది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా.. ఇరాక్ మాత్రం ఎక్కడా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఈ బిల్లును పార్లమెంట్‌లో న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.

Iraq : కొత్త చట్టం అమలయితే.. 9 ఏళ్లకే పెళ్లి

దేశంలో యువతల వివాహ కనీస వయస్సు 9 ఏళ్లుగా నిర్ణయించేందుకు ఇరాక్ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తుంది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా.. ఇరాక్ మాత్రం ఎక్కడా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఈ బిల్లును పార్లమెంట్‌లో న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో దీనిని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అమ్మాయి వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. ఈ బిల్లు పాస్ అయితే మాత్రం అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించబడుతుంది.

Also Read: Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్


ఈ బిల్లు పార్లమెంట్‌లో పాసయితే.. ఆ వయస్సులో వారు వివాహం చేసుకునేందుకు ఎటువంటి అడ్డంకి ఉండదు. మరోవైపు ఇది బాల్య వివాహాలు పెరిగేందుకు కారణమవుతుందనే ఆందోళన సైతం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. అలాగే లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతి అంతా ఒక్కసారిగా మాయవుతుందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ బిల్లును మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలతోపాటు పౌర సమాజం సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Also Read: wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?

Also Read: Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు


ఈ బిల్లు చట్టబద్దత పొందితే మాత్రం.. యువతుల విద్యా, ఆరోగ్యంపై తీవ్ర పరిణామాలు చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాదు.. బాల్య వివాహాలు పెరగడం, స్కూళ్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గృహ హింస పెరగడమే కాకుండా.. చిన్న వయస్సుల్లోనే గర్భాదారణ ధరించడంతో యువతల్లో అనేక సమస్యలు తలెత్తుతాయనే అభిప్రాయపడుతున్నారు.

Also Read: Bangladesh Violance: బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన 7,200 మంది భారతీయ విద్యార్థులు

Also Read: Gujarat Model: చికాగోలో టీచర్ గారు.. జీతం మాత్రం గుజరాత్‌లో..


అదీకాక ఇరాక్‌లో ఇప్పటికే 18 ఏళ్ల కంటే వయస్సు తక్కువ ఉన్న 28 మందికి వివాహాలు జరుగుతున్నాయని యూనిసెఫ్ గణాంకాల స్పష్టం చేస్తున్నాయి. ఓ వేళ ఈ బిల్లు పాసయితే దేశంలో పురోగతి అణిచివేతకు గురవుతుందని మానవ హక్కుల వాచ్ పరిశోధకుడు శరహ్ సన్‌బార్ తెలిపారు. గతంలో ఈ వివాహ చట్టాలకు సంబంధించి బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిని చట్టసభ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం విధితమే.

Also Read: Odisha: విద్యార్థులకు అస్వస్థత.. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఏర్పాటు

Also Read: Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 02:29 PM