Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Israel Hamas War: గాజా శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడుల్లో 11 మంది మృతి.. WHO స్పందన

ABN , Publish Date - Mar 03 , 2024 | 10:55 AM

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Israel hamas war) ఇంకా ముగియకపోగా..అది మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఒక ఆసుపత్రి సమీపంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 11 మంది మరణించారు.

Israel Hamas War: గాజా శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడుల్లో 11 మంది మృతి.. WHO స్పందన

ఇజ్రాయెల్, హమాస్(Israel hamas war) మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇంకా ముగియకపోగా..అది మరింత తీవ్రంగా మారుతోంది. ఈ క్రమంలోనే గాజా(Gaza)లోని హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ రఫా నగరంలో ఉన్న శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్(Israel) దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. అదే సమయంలో ఇది ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఖచ్చితమైన దాడి అని ఇజ్రాయెల్ సైన్యం(army) పేర్కొంది.

రాఫా నగరం(rafah city)లో ఉన్న ఎమిరాటీ మెటర్నిటీ హాస్పిటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్-ఖుద్రా ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో 11 మంది పౌరులు అమరులయ్యారని ప్రకటించారు. పిల్లలతో సహా 50 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో ఒక వైద్యాధికారి కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ దాడికి సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఫుటేజీలో వీధుల్లో పడి ఉన్న వ్యక్తుల రక్తంతో తడిసిన మృతదేహాలను చూడవచ్చు. దాడిలో గాయపడిన వారిని కువైట్ ఆసుపత్రికి తరలించారు.


ఇక ఈ దాడిని ఇజ్రాయెల్ సైన్యం(Israel army) ధృవీకరించింది. ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డామని సైన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది. హమాస్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇజ్రాయెల్ సైనికులు గాజా స్ట్రిప్‌లోని ఆసుపత్రుల చుట్టూ అనేకసార్లు ఆపరేషన్లు చేశాయి. హమాస్ ఉగ్రవాదులు తమ పని కోసం ఆసుపత్రులను ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణను హమాస్ ఖండించింది.


శరణార్థి శిబిరాలపై జరిగిన ఈ దాడిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్(tedros adhanom ghebreyesus) ఖండించారు. ఇళ్లు కోల్పోయిన ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు నిర్మించిన శిబిరాలపై ఈ దాడి అత్యంత దారుణమైనదని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా ఆయన వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు, చిన్నారులు ఉన్నారని ప్రస్తావించారు. ఆరోగ్య కార్యకర్తలు, పౌరులు లక్ష్యాలు కావొద్దని ఆయన కోరారు. వీరిని ఎల్లవేళలా రక్షించాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ అన్నారు. దీంతో పాటు కాల్పుల విరమణ చేయాలని ఇజ్రాయెల్‌కు కూడా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Donald Trump: డోనాల్డ్ ట్రంప్ జోరు.. మరో మూడు రాష్ట్రాల్లో కూడా నిక్కీ హేలీని..

Updated Date - Mar 03 , 2024 | 10:55 AM