ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడి ప్లాన్లు లీక్
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:29 AM
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడికి ప్రణాళికలు బహిర్గతమయ్యాయి. పెంటగాన్ నుంచి రెండు కీలక పత్రాలు బయటకు వచ్చాయి.
పెంటగాన్ నుంచి కీలక పత్రాలు బయటకు
టెల్ అవీవ్, అక్టోబరు 20: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడికి ప్రణాళికలు బహిర్గతమయ్యాయి. పెంటగాన్ నుంచి రెండు కీలక పత్రాలు బయటకు వచ్చాయి. అక్టోబర్ 1న ఇరాన్ 200 క్షిపణులతో దాడి చేశాక ఇజ్రాయెల్ ప్రతిదాడికి పెద్ద ఎత్తున సన్నద్ధమౌతున్నట్లు ఈ పత్రాల్లో ఉంది. ఇజ్రాయెల్ బలగాల సన్నద్ధతపై అమెరికా గూఢచార ఉపగ్రహాల సాయంతో నేషనల్ జియోస్పాటికల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రూపొందించిన కీలక పత్రాలను ఇరాన్ అనుకూల టెలిగ్రామ్ ఛానళ్లలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. దీంతో అమెరికా ప్రభుత్వం కీలక పత్రాల లీకేజీ ఎలా జరిగిందనే విషయంపై ఉమ్మడి దర్యాప్తునకు ఆదేశించింది. గాజాపై ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడుల్లో 87 మంది చనిపోయారు.