Share News

కోర్టు బోను ఎక్కనున్న నెతన్యాహు

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:15 AM

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తొలిసారిగా మంగళవారం ఓ అవినీతి వ్యవహారంలో కోర్టు బోను ఎక్కనున్నారు.

కోర్టు బోను ఎక్కనున్న నెతన్యాహు

జెరూసలేం, డిసెంబరు 9: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తొలిసారిగా మంగళవారం ఓ అవినీతి వ్యవహారంలో కోర్టు బోను ఎక్కనున్నారు. మీడియాలో ప్రచారం కోసం కొన్ని మీడియా సంస్థల అధిపతులకు లబ్ధి కలిగించే విధంగా ప్రభుత్వ నిబంధనలను నెతన్యాహు ఉల్లంఘించారని, ఓ హాలీవుడ్‌ నిర్మాతతోనూ ఇలాగే వ్యవహరించారని గతంలోనే మూడు కేసులు దాఖలయ్యాయి. వీటిపై 2020లోనే కోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే, గాజాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలంటూ నెతన్యాహు పలుమార్లు కోర్టును కోరుతూ వచ్చారు. పలు వాయిదాల అనంతరం, మంగళవారం నుంచి విచారణ పునఃప్రారంభం కానుంది. దీంట్లో భాగంగా, వారానికి మూడు రోజులపాటు నెతన్యాహు కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. తీర్పు 2026లో వెలువడొచ్చు.

Updated Date - Dec 10 , 2024 | 03:15 AM