Share News

Italian scientists : చందమామపై గుహ

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:55 AM

విశాలమైన మైదానాలు.. పెద్ద పెద్ద లోయలు.. చందమామపై ఇవే ఉంటాయని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ.. అక్కడ ఒక కొండరాతిపై నుంచి కిందికి 100 మీటర్ల లోతుకు విస్తరించినగోతిలాంటి గుహ కూడా ఉందనే విషయాన్ని ఇటాలియన్‌ శాస్త్రజ్ఞులు గుర్తించారు.

 Italian scientists : చందమామపై గుహ

కేప్‌కెనవరాల్‌, జూలై 15: విశాలమైన మైదానాలు.. పెద్ద పెద్ద లోయలు.. చందమామపై ఇవే ఉంటాయని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ.. అక్కడ ఒక కొండరాతిపై నుంచి కిందికి 100 మీటర్ల లోతుకు విస్తరించినగోతిలాంటి గుహ కూడా ఉందనే విషయాన్ని ఇటాలియన్‌ శాస్త్రజ్ఞులు గుర్తించారు.

55 ఏళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మొట్టమొదటిసారి చంద్రుడిపై కాలు మోపిన ‘సీ ఆఫ్‌ ట్రాంక్విలిటీకి’ 400 కిలోమీటర్ల దూరంలో ఆ గుహ ఉన్నట్టు వారు పేర్కొన్నారు. అలాంటి గుహలు ఇంకా బోలెడు ఉంటాయని.. భవిష్యత్తులో జాబిలిపైకి వెళ్లే వ్యోమగాములు బేస్‌ నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయని వారు ఆశిస్తున్నారు. కొండరాతిపై నుంచి లావా ప్రవహించడం వల్ల ఈ గుహ ఏర్పడి ఉంటుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

Updated Date - Jul 16 , 2024 | 03:55 AM