Share News

Viral News: 17 సార్లు గర్భవతి.. తీరా చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేమైందంటే?

ABN , Publish Date - Feb 19 , 2024 | 08:57 PM

తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం. కానీ.. ఈ వరాన్ని కొందరు తప్పుడు పనులకు వినియోగించుకుంటున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మతనాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సైతం అలాంటి పాడు పనికే పాల్పడింది.

Viral News: 17 సార్లు గర్భవతి.. తీరా చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేమైందంటే?

తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం. కానీ.. ఈ వరాన్ని కొందరు తప్పుడు పనులకు వినియోగించుకుంటున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మతనాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సైతం అలాంటి పాడు పనికే పాల్పడింది. ప్రభుత్వం అందించే సహాయాన్ని నొక్కేయడంతో పాటు పని నుంచి తప్పించుకోవడానికి గర్భవతిగా నాటకం ఆడింది. ఆమె ఆడిన ఈ నాటకం 17సార్లు సక్సెస్ అయ్యింది కానీ, 18వ సారి మాత్రం తేడా కొట్టేసింది. అధికారులకు అడ్డంగా దొరికిపోయి.. కటకటాలపాలయ్యింది.

ఆ మహిళ పేరు బార్బరా ఐయోలీ. ఆమె వయసు 50 సంవత్సరాలు. ఈజీ మనీకి అలవాటు పడిన ఆమె, అడ్డదారిలో డబ్బులెలా సంపాదించాలో ఓ చిటుకు తెలుసుకుంది. గర్భవతులకు ప్రభుత్వ సహాయం అందుతుందని, సెలవులు కూడా దొరుకుతాయని తెలుసుకుని.. గర్భం దాల్చకున్నా గర్భవతినంటూ నాటకం ఆడటం మొదలుపెట్టింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. గత 24 ఏళ్లలో ఏకంగా 17 సార్లు గర్బవతిగా నటించింది. ఈ సమయంలో ఆమె ప్రసూతి సెలవులు, ప్రభుత్వం అందించే సహాయాలను (సుమారు రూ.98 లక్షల వరకు) పొందింది. తాను 17సార్లు గర్భం దాల్చానని, అందులో 12 సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. మిగతా ఐదుగురు పిల్లలైన బెనెడెట్టా, ఏంజెలికా, అబ్రమో, లెటిజియా, ఇస్మాయిల్‌లను తాను పోషిస్తున్నాని చెప్పుకొచ్చింది.


తాను ఆడిన ఈ నాటకం విజయవంతం అవ్వడంతో.. 18వ సారి కూడా ఫేక్ ప్రెగ్నెన్సీ నాటకానికి బార్బరా తెరలేపింది. తాను 18వ సారి కూడా గర్భం దాల్చానని.. కంపెనీ నుంచి సెలవులతో పాటు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించాలని అధికారుల్ని అభ్యర్థించింది. దీంతో ఆమెపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది.. వెంటనే సీక్రెట్‌గా విచారణ చేపట్టారు. గతేడాది డిసెంబర్ నుంచి ఆమెపై నిఘా పెట్టారు. ఫైనల్‌గా ఆమె ఆడుతున్న నాటకం బట్టబయలైంది. సాక్ష్యాధారాలతో సహా ఆమెను అడ్డంగా పట్టుకున్నారు. ప్రభుత్వ సహాయం పొందడం కోసమే గర్భవతిగా నటిస్తూ వస్తోందని పోలీసులు విచారణలో తేల్చారు. గత 20 ఏళ్ల నుంచి జనన ధృవీకరణ పత్రాలను దొంగిలించిందని, అనేకసార్లు వైద్యుల నుండి నకిలీ సంతకాలు కూడా పొందిందని కనుగొన్నారు.

తన భార్య బండారం ఇలా బయటపడటంతో.. బార్బరా భర్త డేవిడ్ మరిన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. తన భార్య చర్యల గురించి తనకు ముందే తెలుసని కుండబద్దలు కొట్టాడు. తమ సంబంధం 2012లో ప్రారంభమైందని, అప్పటి నుంచే ఆమె ఫేక్ ప్రెగ్నెన్సీ నాటకం గురించి తనకు తెలుసని పేర్కొన్నాడు. ఈ విధంగా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తూ.. తనకు తక్కువ శిక్ష విధించాలని కోరాడు. మరోవైపు.. బార్బరాకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

Updated Date - Feb 19 , 2024 | 08:57 PM