బెజోస్ రెండో పెళ్లి ఖర్చు రూ.5,096కోట్లు
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:42 AM
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెల 28న తన ప్రేయసి లారెన్ శాంచెజ్‌ను పెళ్లిచేసుకోబోతున్నారు.
కొలరాడోలో ఈ నెల 28న వేడుక
వాషింగ్టన్, డిసెంబరు 22: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెల 28న తన ప్రేయసి లారెన్ శాంచెజ్‌ను పెళ్లిచేసుకోబోతున్నారు. కొలరాడోలోని ఆస్పెన్‌లో దాదాపు 180 మంది సన్నిహితులు, కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో బెజో్‌స-శాంచెజ్ వివాహం జరగనుంది. 60ఏళ్ల బెజోస్ తన రెండో పెళ్లికి ఏకంగా రూ.5,096కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. గతేడాది మే నెలలోనే బెజో్‌స-శాంచెజ్‌ల నిశ్చితార్థం జరిగింది. అప్పుడు బెజోస్ రూ.21కోట్ల విలువైన వజ్రాల ఉంగరంతో బెజోస్ ప్రపోజ్ చేశారని కథనాలు వెలువడ్డాయి. శాంచెజ్‌కు ఇది మూడో వివాహం. బెజోస్ తన మొదటి భార్య మెకంజీ స్కాట్‌కు 2019లో విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం బెజోస్ ఆస్తి విలువ 251 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో లెక్కేస్తే రూ21.32లక్షల కోట్లు.