Kamala Harris: ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 07 , 2024 | 06:57 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నువ్వు-నేనా అన్నట్టు తలపడన డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన ఓటమిపై తొలిసారి స్పందించారు. ట్రంప్ చేతిలో ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే ఎన్నికల్లో పోరాటం విషయంలో తాను ఓడిపోలేదని అన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నువ్వు-నేనా అన్నట్టు తలపడన డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన ఓటమిపై తొలిసారి స్పందించారు. ట్రంప్ చేతిలో ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే ఎన్నికల్లో పోరాటం విషయంలో తాను ఓడిపోలేదని అన్నారు. ‘‘ నేను ఎన్నికల ఓటమిని అంగీకరిస్తున్నాను. కానీ ఎన్నికల్లో పోరాటం విషయంలో అంగీకరించబోను. ప్రజలందరి స్వేచ్ఛ, అవకాశాలు, గౌరవం కోసం పోరాడాను’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు 15 నిమిషాలపాటు ఆమె ప్రసంగించారు. కమలా హారిస్ ఓటమి ప్రకటన చేస్తున్నప్పటికీ మద్దతుదారులు అనుకూల నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఆమె పోరాటానికి అభినందిస్తూ ఈ నినాదాలు చేశారు. దీంతో ‘‘పోరాటాన్ని కొనసాగించండి’’ అంటూ తన మద్దతుదారులకు కమలా హారిస్ పిలుపునిచ్చారు.
‘‘తగినంత చీకటి ఉన్నప్పుడు మాత్రమే నక్షత్రాలు కనబడతాయి. మనం చీకటి సమయంలో ప్రవేశిస్తున్నామని చాలా మంది భావిస్తున్నారని నాకు తెలుసు. ఆకాశాన్ని బిలియన్ల కొద్ది నక్షత్రాల కాంతితో నింపుదాం. సత్యం, ఆశావాదం, సేవ అనే కాంతితో ఆకాశాన్ని నింపుదాం’’ అని ఆమె పేర్కొన్నారు.
‘‘"ఈ ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదు. మనం పోరాడింది దీని కోసం కాదు. మనం ఓటు వేసింది ఈ ఫలితం కోసం కాదు. అయితే మనం వదిలిపెట్టకుండా పోరాడుతూ ఉన్నంత కాలం అమెరికా ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటుంది. పోరాటం చేయగలిగినంత కాలం చేస్తూనే ఉందాం’’ అని మద్దతుదారులకు కమలా హారిస్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
‘‘ మనం ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించాల్సిందే. ఇంతకముందే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాను. విజయం సాధించిన ఆయనకు అభినందనలు తెలిపాను’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు వాషింగ్టన్‌లోని హోవార్డ్ విశ్వవిద్యాలయం వేదికగా ప్రకటన చేశారు. ‘‘ అధికార మార్పిడిలో మీకు, మీ బృందానికి సహకరిస్తామని ట్రంప్‌కు చెప్పాను. శాంతియుతంగా అధికార మార్పిడిలో పాల్గొంటామని తెలిపాను’’ అని కమలా హారిస్ పేర్కొన్నారు.
ట్రంప్ ఘనవిజయం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 270ని సునాయాసంగా ట్రంప్ అందుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ 295 ఎలక్టోరల్ ఓట్లు, కమలా హారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో ట్రంప్ అరుదైన రికార్డు సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, తదుపరి ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం మరో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 131 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కోర్టుల్లో క్రిమినల్ కేసులు వెంటాడుతున్నా.. ప్రచారంలో హత్యాయత్నాలు జరిగినా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు. విజయాన్ని కూడా సాధించి మరో పర్యాయం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నారు.
ఇవి కూడా చదవండి
గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్-ఎంఎస్ ధోనీ.. ఫొటోలు, వీడియోలు వైరల్
మీ భార్య డెలివరీకి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే.. గవాస్కర్‌కి ఆసీస్ మాజీ క్రికెటర్ కౌంటర్
వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే
విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయిన వ్యక్తి.. ఆ తర్వాత జరిగిందిదే