Share News

Iran: ఇరాన్‌కు అలీ ఖమేనీ కీలక ఆదేశాలు..!!

ABN , Publish Date - Aug 01 , 2024 | 10:49 AM

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. హనియా హత్యను ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. హనియాను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్, ఇరాన్ భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ కూడా విశ్వసిస్తున్నారు. ఆ క్రమంలో గురువారం రోజున ఇరాన్‌కు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

Iran: ఇరాన్‌కు అలీ ఖమేనీ కీలక ఆదేశాలు..!!
Ayatollah Ali Khamenei Orders To Iran

టెహ్రాన్: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. హనియా హత్యను ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. హనియాను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్, ఇరాన్ భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) కూడా విశ్వసిస్తున్నారు. ఆ క్రమంలో గురువారం రోజున ఇరాన్‌కు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.


ఆ సమావేశంలో ఆదేశాలు..

హనియా మృతి తర్వాత నిన్న (బుధవారం) ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఆ సమావేశంలోనే ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఖమేనీ ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. కీలక అధికారులకు సమాచారం అందజేశారని న్యూయార్క్ టైమ్స్ కథనం రాసుకొచ్చింది. హమాస్ అధినేత ఇరాన్‌లో చనిపోవడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలతో పరిస్థితి దిగజారే అవకాశం ఉంది.


ఇంటి వద్ద దాడి, మృతి

టెహ్రాన్‌లోని నివాసం వద్ద హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా‌పై ప్రత్యర్థులు బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఖతార్‌లో ఇస్మాయిల్ మంగళవారం పలు రాజకీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనితో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఆ సమయంలో క్షిపణితో ఇజ్రాయెల్ దాడి చేసింది. దాడిలో హనియా, అతని బాడీ గార్డ్ చనిపోయాడు. గాజాలో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతోంది. పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.


హనియా నేపథ్యం..

1962లో గాజాకు సమీపంలో ఓ శరణార్థి శిబిరంలో ఇస్మాయిల్ జన్మించాడు. 1980 చివరలో హమాస్‌లో చేరాడు. 1990లో ఇస్మాయిల్ హనియా పేరు ప్రపంచానికి తెలిసింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు సన్నిహితంగా ఉండేవారు. రాజకీయంగా సలహాలు ఇచ్చేవారు. అలా హమాస్‌లో క్రమంగా ఎదిగారు. 2004లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో అహ్మద్ యాసిన్ చనిపోయారు. తర్వాత హమాస్‌లో ఇస్మాయిల్ కీలక వ్యక్తిగా మారారు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికయ్యారు. గాజా పట్టిని కొద్దిరోజులు పాలించారు. 2007 జూన్‌లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ అతన్ని పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో యుద్ధం జరుగుతోంది. అబ్బాస్ ఆదేశాలను ధిక్కరించి ప్రధానిగా కొనసాగాడు. 2017లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019లో గాజా పట్టిని వీడి, ఖతర్‌లో ఉంటున్నారు. ఈ ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు చనిపోయారని హమాస్ ప్రకటించింది.


Read Latest
International News and Telugu News

Updated Date - Aug 01 , 2024 | 10:49 AM