Share News

Kim Jong Un: కిమ్ మరోసారి క్రూర నిర్ణయం.. ఇద్దరు మహిళలకు ఉరి.. పలువురికి జీవిత ఖైదు

ABN , Publish Date - Sep 23 , 2024 | 02:07 PM

అడాల్ఫ్ హిట్లర్ అనే ఓ నియంత ఉండేవాడని గతంలో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ కిమ్ జంగ్ ఉన్‌ అనే నియంతను మనం నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉత్తర కొరియా నియంతగా కిమ్ జంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

Kim Jong Un: కిమ్ మరోసారి క్రూర నిర్ణయం.. ఇద్దరు మహిళలకు ఉరి.. పలువురికి జీవిత ఖైదు

సియోల్, సెప్టెంబర్ 23: అడాల్ఫ్ హిట్లర్ అనే ఓ నియంత ఉండేవాడని గతంలో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ కిమ్ జంగ్ ఉన్‌ అనే నియంతను మనం నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తున్నాయి. తీవ్రమైన ఆంక్షలతో దేశ ప్రజలను ఆయన కట్టిడి చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దాదాపుగా తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.

Also Read: Jammu And Kashmir: నేటితో ముగియనున్న రెండవ దశ ఎన్నికల ప్రచారం


ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఇద్దరు మహిళలను ఉరి తీసింది. ఉత్తర కొరియాకు చెందిన రీ (39), కాంగ్ (43) చైనాలోని నివసిస్తున్నారు. చైనాలోని ఉత్తర కొరియా వాసులను రహస్యంగా దక్షిణ కొరియాకు పారిపోయేందుకు వీరిద్దరు సహకరిస్తున్నట్లు నియంత కిమ్ జంగ్ ఉన్‌ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. మనుషుల అక్రమ రవాణాకు వారిద్దరు సహకరిస్తున్నట్లు కిమ్ జంగ్ ఉన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని ఉత్తర కొరియాకు తీసుకు వచ్చింది. ఈ సందర్బంగా వీరిద్దరిని ప్రజల మధ్య బహిరంగ ప్రదేశంలో విచారించింది.

Also Read: Viral News: తనను కిడ్నాప్ చేసిన వారికి శిక్ష పడేలా చేసిన యువకుడు.. అదీ 17 ఏళ్ల తర్వాత.. ఎలాగంటే..?


దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ విచారణ అనంతరం ఆ ఇద్దరు మహిళలను అదే రోజు కిమ్ జంగ్ ఉన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉరి తీసింది. ఇక దాదాపుగా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది మహిళలకు జీవిత ఖైదు విధించింది.

Also Read: Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం


ఉత్తర కొరియాలో కఠిన ఆంక్షల నేపథ్యంలో భారీ సంఖ్యలో మహిళలు చైనాకు పారిపోతున్నారు. అలా వెళ్తున్న వారిలో మహిళలే అత్యధికంగా ఉన్నారు. అలా వెళ్లిన మహిళలు.. వ్యభిచార కూపాల్లొ చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా బంద్


చైనాలో ఉండి శత్రు దేశమైన దక్షిణ కోరియా పారిపోయేందుకు సహాకరిస్తున్న ఈ మహిళలకు ఉరి శిక్ష విధించినట్లు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని మానవ హక్కుల సంఘం జియోరెమోల్ యూనిఫికేషన్ సాలిడారిటీ సంస్థ వెల్లడించింది.

Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు


మరోవైపు దేశం వదిలి వెళ్లిన వారిని మళ్లీ స్వదేశానికి రప్పిస్తున్న వారిపై నియంత కిమ్ జంగ్ ఉన్ తీసుకుంటున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ క్రమంలో అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించి కిమ్ ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను వదిలి వెళ్లిన వారిని మళ్లీ తిరిగి స్వదేశానికి పంపించే ప్రయత్నాలను నిలిపివేయాలంటూ చైనాతోపాటు దక్షిణ కొరియాకు ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి చేసింది.

Read Latest International News And Telugu News..

Updated Date - Sep 23 , 2024 | 02:17 PM