US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరుదైన సంఘటన
ABN , Publish Date - Nov 05 , 2024 | 08:13 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల వేళ.. న్యూయార్క్ నగరంలో బ్యాలెట్ పేపర్‌లో భారతీయ భాషకు చోటు కల్పించింది. అత్యధికంగా మాట్లాడే హిందీకి కాకుండా.. మరో భాషకు అవకాశం కల్పించింది. అదీ కూడా ఓ ప్రాంతీయ భాష కావడం గమనార్హం.
న్యూయార్క్, నవంబర్ 05: అగ్రరాజ్యం అమెరికాకు వలసల పోటు తప్పదు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారంతా అమెరికా ప్రయాణానికి క్యూ కడుతూ ఉంటారు. దీంతో భిన్న దేశాలకు చెందిన వారితో.. విభిన్న జాతుల సమాహారంగా అమెరికా మారింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి వేళ.. న్యూయార్క్ నగరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్నికల పోలింగ్ వేళ.. బ్యాలెట్ పేపర్లలో భారతీయ భాషకు చోటు దక్కింది. అది కూడా భారతీయులు అత్యధికంగా మాట్లాడుకునే హిందీ భాషకు చోటు కల్పించ లేదు. బెంగాలీ భాషకు చోటు కల్పించడం గమనార్హం.
Also Read: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
బ్యాలెట్ పత్రంలో ఇంగ్లీష్‌తోపాటు మరో నాలుగు భాషలకు మాత్రమే స్థానం కల్పించారు. అందులో బెంగాలి ఒకటి. మిగిలిన మూడు భాషలు చైనీస్, స్పానిష్, కొరియన్‌లు ఉన్నాయి. ఇంగ్లీషుతో పాటు ఈ నాలుగు భాషలకు చోటు కల్పించాలని భావించామని న్యూయార్క్ సిటీ బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ జే రేయాన్ స్పష్టం చేశారు.
Also Read: US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్
అయితే బ్యాలెట్ పేపర్లలో బెంగాలి భాషను ముద్రించడం పట్ల పలువురు స్వాగతిస్తున్నారు. టైమ్ స్క్వేర్ వద్ద షాప్ నిర్వహించే.. సుభాష్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ అందరికీ అర్థమవుతుందని చెప్పారు. కానీ బెంగాలీ తమ సొంత భాష అని.. దీనిని కొంత మంది మాత్రమే అర్థం చేసుకోగలరని వివరించారు.
Also Read: Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు
ఇక బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ సేవలందించే భాషల జాబితాలో బెంగాలీ ఎందుకు ఉందనే విషయాన్ని ర్యాన్ ఈ సందర్భంగా వివరించారు. భారతదేశం విభిన్న భాషల సమాహారమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అనేక భాషలున్నప్పటికీ గతంలో కోర్టులో వేసిన ఓ దావా కారణంగా ఎన్నికల ప్రక్రియలో బెంగాలీకి స్థానం లభించిందని తెలిపారు. ఈ భాషకు స్థానం కల్పించడంపై న్యూయార్క్‌లోని భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దుబాయ్‌లో వింత.. ఒక్కసారిగా మారిన వాతావరణం
ఇక అమెరికాలో ప్రచార చట్టాలను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుండగా.. ఎన్నికల ప్రక్రియను మాత్రం ఆయా రాష్ట్రాలు పర్యవేక్షిస్తుంటాయన్న విషయం విధితమే. అందులోభాగంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సమయం, కౌంటింగ్ ప్రక్రియకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి.
Also Read: బీట్ రూట్ జ్యూస్‌తో ఇన్ని ఉపయోగాలా..?
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా న్యూయార్క్ రాష్ట్రంలోని బ్యాలెట్ పేపర్లలో భారతీయ భాష బెంగాలీని చేర్చడం గర్వించదగ్గ విషయమని సోషల్ మీడియాలో భారతీయ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీ మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తన సత్తా చాటి మరోసారి అమెరికా అధ్యక్షుడి పదవి చేపట్టాలని డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్ష పదవి నుంచి దేశాధ్యక్ష పదవి అందుకోవాలని కమలా హారిస్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది.
For InterNational News And Telugu News