Share News

Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడి కొత్త రాగం

ABN , Publish Date - Aug 10 , 2024 | 07:23 PM

భారత్ అంటేనే కత్తులు నూరిన మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమైన విషయం విదితమే.

Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడి కొత్త రాగం

ఢిల్లీ: భారత్ అంటేనే కత్తులు నూరిన మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమైన విషయం విదితమే. భారత్, మాల్దీవుల మధ్య తెగిపోతున్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జైశంకర్ పర్యటన సాగింది. సమావేశం అనంతరం ముయిజ్జు మాట్లాడుతూ.. తమ దేశానికి నిత్యం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


భద్రత, అభివృద్ధి, సాంస్కృతిక విషయాల్లో పరస్పర సహకారం ద్వారా ఢిల్లీ, మలే మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. “ఇవాళ జైశంకర్‌ని కలవడం, మాల్దీవుల్లోని 28 ద్వీపాలలో మురుగునీటి ప్రాజెక్టుల సహకారానికి భారత్ ముందుకు రావడం శుభపరిణామం. మాల్దీవులకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. భద్రత, అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడిలో పరస్పరం సహకరించుకుంటే ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. మేం కలిసి ఇరు దేశాల ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తాం” అని ముయిజ్జు ఎక్స్‌లోని ఓ పోస్ట్‌లో తెలిపారు. మాల్దీవుల్లోని 28 ద్వీపాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాల కల్పించడంలో భారత్ సహకరించింది. ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో కూడిన రుణాన్ని అందించింది.

Updated Date - Aug 10 , 2024 | 07:28 PM

News Hub