Adult Content: అశ్లీల వీడియోలు చూస్తున్నారా.. ఇకపై ఈ పని చేయాల్సిందే!
ABN , Publish Date - Jul 07 , 2024 | 07:22 PM
స్వయంతృప్తి కోసం యువత ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు చూస్తుంటారు. ఈమధ్య కాలంలో ఈ కంటెంట్ చూసే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. చిన్నా-పెద్దా అని తేడా లేకుండా.. ప్రతిఒక్కరూ అడల్ట్ కంటెంట్...
స్వయంతృప్తి కోసం యువత ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు (Adult Content) చూస్తుంటారు. ఈమధ్య కాలంలో ఈ కంటెంట్ చూసే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. చిన్నా-పెద్దా అని తేడా లేకుండా.. ప్రతిఒక్కరూ అడల్ట్ కంటెంట్ చూసేందుకు ఎగబడుతున్నారు. చివరికి మైనర్స్ సైతం దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే.. స్పెయిన్ (Spain) ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. మైనర్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. ఓ యాప్‌ను తీసుకొస్తోంది.
స్పెయిన్‌లో ‘డేల్ ఉనా వుల్టా’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ.. అశ్లీల వీడియోల వీక్షణ అధికమైనట్లు తేల్చింది. అందునా.. మైనర్లే ఎక్కువగా ఉన్నారని తేలడంతో, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ.. మైనర్లు చూడకుండా ఉండేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ప్రధాని పెడ్రో శాంచెజ్ (Pedro Sanchez) ఈ అంశంపై మాట్లాడుతూ.. 15 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో 50% మంది పిల్లలు అశ్లీల చిత్రాలను చూస్తున్నారని తేలిందన్నారు. దీన్ని అడ్డుకోవడం కోసం ఒక యాప్‌ను లాంచ్ చేస్తున్నామని అన్నారు.
ఆ యాప్ ఎలా పని చేస్తుంది?
ఆ యాప్ పేరు ‘కార్టెరా డిజిటల్ బీటా’. స్థానికంగా దీనిని ‘పజాపోర్టే’ అని పిలుస్తున్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్లలో అశ్లీల వీడియోలు చూసేందుకు ఓ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినప్పుడు.. ఆ వినియోగదారుని వయసు 18 సంవత్సరాలా? కాదా? అని సదరు ప్లాట్‌ఫామ్ ధృవీకరించడానికి ఈ యాప్ అనుమతి ఇస్తుంది. ఇదొక మొబైల్ వ్యాలెట్‌గా పని చేస్తుంది. ఇందులో ప్రభుత్వం మొత్తం ఐదు ఐడీలు ఇస్తుంది. అందులో ఒక ఐడీ వినియోగదారు వయస్సుని ధృవీకరిస్తుంది. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి.. అడల్ట్ కంటెంట్ చూసేందుకు యాక్సెస్ లభించదు.
అదే 18 ఏళ్ల వయసు దాటిని వారికి.. నెలకు 30 క్రెడిట్స్ అందజేస్తారు. వీటి ద్వారా అశ్లీల చిత్రాల వెబ్‌సైట్‌కి యాక్సెస్ లభిస్తుంది. వీలైతే యూజర్లు అదనపు క్రెడిట్‌ల కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. ఏదేమైనా సరే.. అడల్ట్ కంటెంట్ వెబ్‌సైట్లు, ఈ యాప్ మాధ్యమంగా యూజర్ల వయసుని తప్పకుండా ధృవీకరించాల్సి ఉంటుంది. దీనిని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం ‘నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్’కు అప్పగించింది. కేవలం అడల్ట్ వెబ్‌సైట్లకే కాదండోయ్.. ఈ పద్ధతిని సోషల్ మీడియా సైట్లకూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
Read Latest International News and Telugu News