Share News

Geomagnetic Storm: భూమిని తాకిన పవర్‌ఫుల్ సోలార్ తుపాను.. నిలిచిపోయిన నె‌ట్‌వర్క్స్?

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:20 PM

సూర్యని నుంచి ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ ఆదివారం భూమిని తాకింది. గత ఆరు సంవత్సరాల్లో ఇది అతిపెద్ద సౌర తుఫాన్ అని, దీని వల్ల భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Geomagnetic Storm: భూమిని తాకిన పవర్‌ఫుల్ సోలార్ తుపాను.. నిలిచిపోయిన నె‌ట్‌వర్క్స్?

సూర్యని నుంచి ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ (Geomagnetic Storm) ఆదివారం (26/03/24) భూమిని తాకింది. గత ఆరు సంవత్సరాల్లో ఇది అతిపెద్ద సౌర తుఫాన్ అని, దీని వల్ల భూ అయస్కాంత క్షేత్రానికి (Planet Magnetic Field) భంగం కలిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొలరాడోలోని బౌల్డర్‌లో ‘NOAA’కు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ సంస్థ తెలిపింది. తుఫాను చుట్టూ పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ.. స్టార్మ్ వాచ్ యాక్టివ్‌గానే ఉందని వెల్లడించింది.

US Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జ్


సౌర తుఫాన్ ప్రభావం

ఈ సౌర తుఫాన్ భూమిని తాకినప్పుడు.. ఇది ఉపగ్రహాలల్లోని ఎలక్ట్రానిక్స్‌కు నష్టం కలిగిస్తుంది. తద్వారా.. భూమిపై రేడియో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలుగుతుంది. GPS సిగ్నల్స్, పవర్ గ్రిడ్‌లను ప్రభావితం చేయవచ్చు. వోల్టేజ్ అంతరాయాలు సంభవించే అవకాశం కూడా ఉంది. అంతరిక్ష వాతావరణ సూచకులు మాట్లాడుతూ.. ఈ తుఫాన్ అధిక-ఫ్రీక్వెన్సీ రేడియో ప్రసారాలకు సైతం అంతరాయం కలిగిస్తుందని అంటున్నారు. ఇటువంటి సౌర తుఫాన్, సౌర కార్యకలాపాలను గుర్తించేందుకు గాను.. సౌర భౌతిక శాస్త్రవేత్తలు అధిక శక్తితో కూడిన కంప్యూటర్లను ఉపయోగిస్తారు. అయితే.. ఈ తుఫాను నిర్మాణం, దిశను కచ్ఛితంగా అంచనా వేయలేం.

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. రాచకొండ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇదిలావుండగా.. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని అయస్కాంత క్షేత్రం పల్టీలు కొడుతుంది. అంటే.. దాని ఉత్తర, దక్షిణ ధృవాల స్థానాలు మారుతుంటాయి. ఈ చక్రంలో.. సౌర కార్యాచరణ మారుతుంది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిలో తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. ఫలితంగా బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి. ఆ బ్లాక్ స్పాట్స్ నుంచి భారీ పేలుళ్లు సంభవించినప్పుడు.. సౌర జ్వాలలు ఎగిసిపడి, ఇలా భూమి వైపు వస్తుంటాయి. ప్రస్తుతం సూర్యుడి సోలార్ సైకిల్ పీక్ స్టేజ్‌కి చేరుకుందని, అందుకే భారీఎత్తున పేలుళ్లు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతేడాది ఏడు పేలుళ్లు సంభవించగా.. ఈ మూడు నెలల్లోనే ఏడు పేలుళ్లు సంభవించాయని తెలిపారు.

1859 నాటి భూ అయస్కాంత తుఫాను.. ఇప్పటివరకు నమోదు చేయబడిన అతిపెద్ద సౌర తుఫాన్‌గా నిలిచింది. దీనిని కారింగ్టన్ స్టార్మ్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ఈ తుఫాన్ కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అరోరా చాలా ప్రకాశవంతంగా, శక్తివంతమైనది ఏర్పడింది. ఆ తర్వాత 2011 ఫిబ్రవరిలో తాకిన సౌర తుఫాన్.. కొద్దిసేపటి వరకు జీపీఎస్ సంకేతాలకు అంతరాయం కలిగించింది.

Updated Date - Mar 26 , 2024 | 10:20 PM