US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్
ABN , Publish Date - Nov 05 , 2024 | 05:46 PM
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకు పోయారు. వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వాషింగ్టన్, నవంబర్ 05: అగ్రరాజ్యం అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలు మంగళవారం అంటే నవంబర్ 5వ తేదీన జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు లక్షలాది మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. మరోవైపు దేశంలో ఇప్పటికే లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు
అయితే అంతరిక్షంలో భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుచ్‌విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ క్రాఫ్ట్‌లో చిక్కుకుపోయారు. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరుకుంటారని సమాచారం. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: దుబాయ్‌లో వింత.. ఒక్కసారిగా మారిన వాతావరణం
పోలింగ్‌స్టేషన్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకో లేని వారి కోసం అబ్సెంట్ బ్యాలెట్‌ను వినియోగిస్తారు. అందులోభాగంగా టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి దాదాపు1.2 మిలియన్ మైళ్ల దూరంలో వ్యోమగాములున్న స్పెస్ స్టేషన్‌కు.. ఈ ఎలక్ట్రానిక్ బ్యాలెట్‌ను ప్రసారం చేస్తారు. ఆ బ్యాలెట్‌లో వారు పూర్తి చేస్తారు. అనంతరం దీనిని ట్రాకింగ్ ద్వారా న్యూ మెక్సికోలోని కేంద్రానికి పంపిస్తారు. అయితే వీరు వేసిన ఓట్లను చాలా రహస్యంగా ఉంచుతారు. ఓటుకున్న సమగ్రతను కాపాడేందుకు అందుకు సంబంధించిన డేటాను రహస్యంగా ఉంచుతారు. అందులోని వివరాలు కౌంటీ క్లర్క్‌కు, అప్లికేషన్ పంపించిన ఆస్ట్రోనాట్‌కు మాత్రమే తెలుస్తాయి.
Also Read: బీట్ రూట్ జ్యూస్‌తో ఇన్ని ఉపయోగాలా..?
అయితే డేవిడ్ ఉల్ఫ్.. అంతరిక్షం నుంచి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1997 ఎన్నికల్లో డేవిడ్ ఉల్ఫ్.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అంతరిక్షం నుంచి చివరిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తి కాటే రూబిన్. 2005లో యూఎస్ దేశాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రుబిన్..తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది.
For InterNational News And Telugu News...