Share News

కాబోయే కోడలికి కీలక పదవి అప్పగించిన ట్రంప్‌

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:51 AM

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వరుసగా తన బంధువులకు కీలక పదవులు అప్పగిస్తున్నారు.

కాబోయే కోడలికి కీలక పదవి అప్పగించిన ట్రంప్‌

వాషింగ్టన్‌, డిసెంబరు 11: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వరుసగా తన బంధువులకు కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు వియ్యంకులకు కీలక బాధ్యతలు అప్పగించిన ఆయన తాజాగా కాబోయే కోడలు కింబర్లీ గిల్ఫోయిల్‌కు కీలక పదవిని కట్టబెట్టారు. ఆమెను గ్రీస్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌కు కింబర్లీకి 2020లో నిశ్చితార్ధం జరిగింది.

Updated Date - Dec 12 , 2024 | 04:51 AM