US Election Result 2024: దేశాధ్యక్షుడు ఎవరో ఎప్పుడు తెలుస్తుందంటే..?
ABN , Publish Date - Nov 05 , 2024 | 09:03 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్‌లో వలే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించదు. యూఎస్ లో 50 రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్వహించు కుంటుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడం ఆలస్యమవుతుంది.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. అలాంటి దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి ఆ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అంతా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కానీ అమెరికాలో అలా కాదు.. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం వంటివి సంస్థలు లేవు. అలాంటి అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ ప్రధాన అభ్యర్థలుగా బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య ప్రదాన పోటీ.. నువ్వా నేనా అన్నట్లుగా ఉందని పలు సర్వేలు, వివిధ మీడియాలు ఇప్పటికే భారీగా కథనాలు వెలువరించాయి.
Also Read:US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరుదైన సంఘటన
Also Read: Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు
అయితే ఫలితాలు ఎప్పుడు వెలువడతాయనే అంశంపై సర్వత్ర తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. 50 రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో వేటికవే ఎన్నికలు నిర్వహించాయి. దీంతో ఓట్ల లెక్కింపు జరిగి.. వాటి ఫలితాలు వెలువడేందుకు చాలా సమయం పడుతుందనే ఓ చర్చ సైతం సాగుతుంది. ఎందుకంటే... ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు అంతా స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో ఫలితాలు వెలువడం మరింత ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ఎవరనేది ప్రకటించే వరకు ప్రపంచవ్యాప్తంగా అందరు ఈ ఫలితాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.
Also Read: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
Also Read: బీట్ రూట్ జ్యూస్‌తో ఇన్ని ఉపయోగాలా..?
మరోవైపు అమెరికాలో టైమ్ జోన్‌ను ఆరు విభాగాలుగా విభజించారు. యూఎస్‌లో మంగళవారం ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. భారత్ కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటల వరకు జరగనుంది. దీంతో బుధవారం రాత్రికి ఈ ఎన్నికల్లో అమెరికా ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నాడనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. కానీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం రోజులు లేదా వారాల సమయం పట్టే అవకాశం ఉందనే చర్చ సైతం సాగుతుంది. ఏదీ ఏమైనా ఈ సారి అధ్యక్షుడు ఎవరేనేది నిర్ణయించేది మాత్రం పెన్సిల్వేనియా రాష్ట్రం అన్నది సుస్పష్టం.
Also Read: US Elections 2024: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సునీత విలియమ్స్
Also Read: దుబాయ్‌లో వింత.. ఒక్కసారిగా మారిన వాతావరణం
ఇక 2020 నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు మాత్రం నవంబర్ 7వ తేదీన వెలువడ్డాయి. అంటే ఫలితాలు వెలువడడానికి నాలుగు రోజుల సమయం పట్టింది. అలాగే 2016 ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచినట్లు అసోసియేట్ ప్రెస్ అదే రోజు రాత్రి ప్రకటించింది. కానీ బీబీసీ మాత్రం ఆ మరునాటి ఉదయం వెల్లడించింది. మరోవైపు 2012 అధ్యక్ష ఎన్నికలు జరిగిన రోజు రాత్రే యూఎస్ అధ్యక్షుడిగా ఒబామా గెలిచినట్లు ప్రకటించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఫలితాలు ఎప్పుడు వెలువతాయనేది చెప్పడం మాత్రం కష్టతరం.
For InterNational News And Telugu News