Share News

Big Breaking: ఇజ్రాయెల్‌పై ఖండాంతర క్షిపణి దాడికి సిద్దమవుతున్న ఇరాన్.. అమెరికా సంచలన హెచ్చరిక

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:46 PM

లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ బలగాలు క్షేత్రస్థాయి దాడులకు దిగిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సన్నద్ధమవుతోందని వైట్ హౌస్ అధికారి ఒకరు హెచ్చరించారు.

Big Breaking: ఇజ్రాయెల్‌పై ఖండాంతర క్షిపణి దాడికి సిద్దమవుతున్న ఇరాన్.. అమెరికా సంచలన హెచ్చరిక
Rain

వాషింగ్టన్: లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ బలగాలు క్షేత్రస్థాయి దాడులకు దిగిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సన్నద్ధమవుతోందని వైట్ హౌస్ అధికారి ఒకరు హెచ్చరించారు. ‘‘ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సంసిద్ధమవుతున్నట్టు అమెరికా వద్ద సంకేతాలు ఉన్నాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌ సన్నాహాలకు మేము క్రియాశీలకంగా సాయం అందిస్తున్నాం. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష సైనిక దాడికి దిగితే ఇరాన్‌ తీవ్ర పరిణామాలను చవిచూస్తుంది’’ అని వైట్‌హౌస్ సీనియర్ అధికారి పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


కాగా ఇరాన్ మద్దతుగల లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్లు ప్రారంభించిన నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది. కాగా ఏప్రిల్‌ నెలలో ఇరాన్ డ్రోన్‌లు, క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించినప్పుడు కూడా అమెరికా సాయం అందించింది. డ్రోన్లు, క్షిపణులను కూల్చడంలో కీలక పాత్ర పోషించింది. అదే తరహా ఇప్పుడు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో ఎక్కువ వాటిని అమెరికా కూల్చివేసింది.


మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం తమ దేశ పౌరులకు అప్రమత్తత ప్రకటించింది. జెరూసలేం, రాజధాని టెల్ అవీవ్‌లోని పౌరులపై కఠినమైన ఆంక్షలు విధించింది. హిజ్బుల్లా లేదా ఇరాన్ నుంచి ప్రతీకార చర్యలు ఉండే అవకాశం ఉండడంతో అలర్ట్ జారీ చేసింది.

Updated Date - Oct 01 , 2024 | 09:46 PM